
అయితే ఈ క్రమంలో మరో జంటపై కూడా అభిమానులు కన్నేశారు. అవును, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్–ఉపాసన దంపతుల గురించి సోషల్ మీడియాలో మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. రామ్ చరణ్–ఉపాసనలు తమ మొదటి సంతానం కోసం దాదాపు పదేళ్ల పాటు వేచి చూశారు. 2023లో వీరు తమ తొలి బిడ్డకు తల్లిదండ్రులుగా మారారు. చరణ్ పాప పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి, ఫ్యాన్స్‌కి ఆనందమే ఆనందం. అప్పటి నుంచి ఈ జంట చిన్నారితో క్వాలిటీ టైమ్ గడుపుతున్నారు. ఇప్పుడు అభిమానుల ఆసక్తి రెండో సంతోషకరమైన వార్తపైకి మళ్లింది. “చరణ్‌కు కొడుకు పుడితే చూడాలి” అనే అభిమానం చాలా కాలం నుంచి ఉంది. ఈ విషయాన్ని చిరంజీవి కూడా పలు సందర్భాల్లో బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో ఉపాసన ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఉపాసన మాట్లాడుతూ, “మొదటి సంతానం విషయంలో ఆలస్యం చేశాను, కానీ రెండో బిడ్డ విషయంలో మాత్రం ఆలస్యం చేయను. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది. హెల్త్‌ను సరిగ్గా కేర్ తీసుకోవడం వల్ల శరీరం రెండో ప్రెగ్నెన్సీకి కూడా బాగా రెడీ అయ్యింది” అని చెప్పిన మాటలు అభిమానుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. ఈ మాటల కారణంగా సోషల్ మీడియాలో అభిమానులు చరణ్–ఉపాసనలపై స్పెషల్ ఫోకస్ చేశారు. “త్వరలోనే మా కోరిక నెరవేరుతుంది”, “మా మెగా ఫ్యామిలీలో మరో చిన్నారిని స్వాగతించడానికి రెడీగా ఉన్నాం” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఉపాసన రెండో ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కొందరు ఫ్యాన్స్ ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతుండగా, కొందరు మాత్రం గాసిప్‌లతో సరదాగా రియాక్ట్ అవుతున్నారు.
ఏది ఏమైనా, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ రూమర్స్, అప్‌డేట్స్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపుతున్నాయి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఒక్కటే – త్వరలోనే చరణ్–ఉపాసనలు మరోసారి తల్లిదండ్రులు అవుతారా..? . ఇదే ఇప్పుడు నెట్టింట బాగా త్రెండ్ అవుతుంది..!