కార్తీక్ ఘట్టమనేని ప్రస్తుతం ఈ డైరెక్టర్ నేమ్ ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. దానికి కారణం తాజాగా వచ్చిన మిరాయ్ మూవీ అని చెప్పుకోవచ్చు.తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమా మూడో సినిమా అయినప్పటికీ కార్తీక్ పది సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న డైరెక్టర్ గా సినిమా తెరకెక్కించారు. ఇక కార్తీక్ ఘటమనేని మొదట సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ వంటి సినిమాలకు డైరెక్టర్గా చేశారు. అయితే ఈ రెండు సినిమాలు అంతా హిట్ అయితే కాలేదు. కానీ మిరాయ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్డం సంపాదించారు కార్తీక్ ఘట్టమనేని.

అయితే అలాంటి ఈ డైరెక్టర్ తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మిరాయ్ సినిమాతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేసే అదృష్టాన్ని అందుకున్నారు. ఇక విషయంలోకి వెళ్తే..మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టడంతో మళ్ళీ వీరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుంది.. అలా బాబీ, చిరంజీవి కాంబోలో రాబోయే సినిమా దసరా రోజు పూజ కార్యక్రమాలతో గ్రాండ్గా స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసే అదృష్టం డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు..

అయితే కార్తీక్ ఘట్టమనేని తన కెరీర్ ని సినిమా స్టార్ట్ చేసింది సినిమాటోగ్రాఫర్ గానే. అలా ఎన్నో హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేశారు. చిత్రలహరి, నిన్ను కోరి,కృష్ణార్జున యుద్ధం, ఎక్స్ప్రెస్ రాజా,ప్రేమమ్,కార్తికేయ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు.అయితే ఇప్పటివరకు చిరంజీవి సినిమాకి సినిమాగ్రాఫర్ గా కార్తీక్ ఘట్టమనేని వర్క్ చేయలేదు.కానీ బాబీ మెగాస్టార్ కాంబోలో రాబోతున్న సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఏకంగా మెగాస్టార్ సినిమాకే డి ఓ పి గా వర్క్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: