ధనుష్ నిత్యమీనన్ కాంబినేషన్లో ఇడ్లీ కడై అనే మూవీ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీసాయి.. ధనుష్ఆడియో లాంచ్ ఈవెంట్లో చిన్నప్పుడు నాకు కనీసం ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. 2 రూపాయల ఇడ్లీ తింటే అప్పట్లో చాలా తృప్తిగా ఉండేది.కానీ ఇప్పుడు ఎన్ని డబ్బులు పెట్టి ఇడ్లీ కొనుక్కొని తిన్నా కూడా అంత సంతృప్తి ఉండడం లేదు. స్నానం చేసే పంపు సెట్టు దగ్గరికి ఒక టవల్ కట్టుకొని రోడ్డు మీద నుండి వెళ్లే వాళ్ళం. చిన్నతనంలో ఎన్నో కష్టాల్ని అనుభవించాం అంటూ ధనుష్ మాట్లాడారు.

అయితే ధనుష్ మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే ధనుష్ కి 7,8 సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే ఆయన తండ్రి కస్తూరి రాజా డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టి నాలుగైదు తెరకెక్కించారు. అలాంటి దర్శకుడు కొడుకుకే తినడానికి తిండి లేదు. ఇడ్లీ తినడానికి రెండు రూపాయలు లేవు అంటే ఎవరు మాత్రం నమ్ముతారు. ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు.కనీసం ఏదైనా చెబితే నమ్మేలా ఉండాలి.మీ నాన్న దర్శకుడైనా మీకు రెండు రూపాయలు లేవా అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఇక మరో నెటిజన్ నేను చాలా మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను.కానీ మీలా రెండు రూపాయల ఇడ్లీ కోసం ఇబ్బందులు అయితే పడలేదు. మీరు చెప్పే మాటలు మరీ ఓవరాక్షన్ గా అనిపిస్తున్నాయి.. సినిమా కోసం మరీ ఇంత చీప్ గా దిగజారుతారా.. సినిమా ప్రమోషన్ కోసం ఇడ్లీ తినడానికి డబ్బులు లేవని చెబుతారా అబద్దాల కోరు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ధనుష్ నిత్యామీనన్ కాంబోలో వచ్చే ఇడ్లీ కడై మూవీ దసరా కానుకగా అక్టోబర్ 1న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: