టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పదమైన డైరెక్టర్ గా పేరు సంపాదించారు రామ్ గోపాల్ వర్మ ఈయన తీసే సినిమాలు కూడా ఒక సంచలనం గానే ఉంటాయి. గత కొన్నేళ్లుగా వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన వర్మ పైన ఎన్నో రకాల కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగుపెట్టిన వర్మ నేటికీ కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.. ఇవన్నీ చాలదన్నట్లుగా ఇప్పుడు తాజాగా వర్మపై మరొక కేసు ఫైల్ అయినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం



రాయదుర్గంలో పోలీస్ స్టేషన్లో వర్మ పైన తాజాగా కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. వర్మ ఇటీవలే తీసినటువంటి దహనం అనే వెబ్ సిరీస్ పైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా రామ్ గోపాల్ వర్మ పైన ఫిర్యాదు చేశారు. దీంతో ఏకంగా వర్మ పైన 5 సెక్షన్ల (IPC 509,468,469,500..120(B))కింద పోలీస్ కేసు నమోదు చేయించినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా తన ఫిర్యాదులో మావోయిస్టుల పైన తీసినటువంటి ఈ వెబ్ సిరీస్లో తన పేరును తీసుకువచ్చారని.. కొన్ని సన్నివేశాలను తానే చెప్పిన విధంగా తీశామని వర్మ చెప్పుకొచ్చాడని తనకు తెలియకుండానే, తన హస్తం లేకుండానే తన పేరును వాడారంటూ అంజనా సిన్హా తన ఫిర్యాదులో తెలియజేసింది. ఈ విషయం పైన పోలీస్ కేసు నమోదు అవ్వడంతో పోలీసులు కూడా దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతున్నారు.


రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన దహనం వెబ్ సిరీస్ కమ్యూనిస్ట్ నేత రాములును ఎలా హత్య చేశారు?తన తండ్రి మరణానికి గల ప్రతికారం తీర్చుకోవాలనే ఒక కొడుకు కథతో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సినిమాని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామంటూ వర్మ తెలిపారు. కానీ ఇందులో వాస్తవం లేదని సినిమాలో చాలా తప్పులు చూపించారంటూ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి అంజనా వెల్లడించారు. మరి ఈ కేసు పై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: