
అందుకే జాగ్రత్తగా ఉండు. చెడు అలవాట్లు చేసుకోకు. నువ్వు మంచి నటుడిగా రాణించు. చంద్రమోహన్ లాంటి కేరెక్టర్ ఆర్టిస్టులు ఎందుకు నిలబడ్డారో నేర్చుకో” అంటూ బండ్ల చెప్పిన సూచనలు అక్కడున్న అందరికీ షాక్ ఇచ్చాయి.ఇక్కడ ప్రతి శుక్రవారం జాతకాలు మారుతాయి అని బండ్ల స్పష్టంగా చెప్పాడు. ఒక్క సినిమా హిట్ కొట్టిందని స్టార్ అయ్యామనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఫ్లాప్ వచ్చిందంటే ఎవ్వరూ కాపాడరని, పొగడ్తల మోసం నమ్మి మేఘాల్లో తేలిపోకూడదని హెచ్చరించాడు. ఈ స్పీచ్ మౌళికే కాదు, కొత్తగా ఎంట్రీ ఇచ్చే యువ హీరోలందరికీ ఒక పాఠం. అంతేకాకుండా నిర్మాతలపై కూడా బండ్ల చురకలు వేశాడు. “రెండున్నర కోట్లతో సినిమా తీసి 50 కోట్లు కొడితే, పెద్ద నిర్మాతలంతా సిగ్గుతో తలవంచుకోవాలి.
ఎందుకంటే వారు ఖర్చు చేసే కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి. ఒక పెద్ద సినిమా మూడు రోజుల షూటింగ్ కాన్సిల్ అయితేనే 2.5 కోట్లు వృథా అవుతాయి. ఆ డబ్బుతో చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి” అంటూ ఇండస్ట్రీలో ఉన్న వ్యర్ధపు ఖర్చులపై బండ్ల గణేష్ బహిర్గతం చేశాడు.బండ్ల గణేష్ ఇచ్చిన ఈ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫన్‌తోపాటు ఫ్యాక్ట్స్ కూడా కలిపి చెప్పినందుకు నెటిజన్లు ఆయనకు థంబ్స్ అప్ ఇస్తున్నారు. కొందరైతే – “బండ్ల గణేష్ ఈసారి ఫన్నీగా కాకుండా చాలా సీరియస్ పాయింట్లు చెప్పారు, ఇవి కొత్త హీరోలకు తప్పక ఉపయుక్తం అవుతాయి” అంటున్నారు. మొత్తానికి బండ్ల మళ్లీ ఒకసారి తన స్టైల్‌లో ఇండస్ట్రీ మాఫియా నిజాలు బయటపెట్టాడు.