టాలీవుడ్‌ చరిత్రలో మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్‌ వద్ద ఢీకొంటే.. అది అభిమానులకు ఒక పండుగే. వారి మధ్య పోటీ అంటే హంగామా ఎప్పుడూ మామూలుగా ఉండదు. అలా 1986లో కూడా ఒక సూపర్ ఇంట్రస్టింగ్‌ పోటీ నెలకొంది. చిరంజీవి కొండవీటి రాజా, బాలయ్య నిప్పులాంటి మనిషి సినిమాలు వారం గ్యాప్‌తో విడుదలై టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి రాజా 1986 జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి, రాధా, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే హిట్ టాక్ తెచ్చుకుంది.
 

యాక్షన్‌, డ్రామా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ సక్సెస్‌ సాధించింది. ముఖ్యంగా చిరంజీవివిజయశాంతి జోడీ అప్పట్లో హిట్ కాంబోగా మారడంతో ఈ సినిమాకు మాస్ ఆడియెన్స్ నుంచి బంపర్ రెస్పాన్స్‌ లభించింది.  అదే సమయంలో బాలకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్ సినిమా టైటిల్‌తోనే నిప్పులాంటి మనిషి అనే సినిమాను తెరకెక్కించాడు. ఇది హిందీ సూపర్‌హిట్‌ సినిమా ఖయామత్ రీమేక్‌. ఈ చిత్రానికి ఎస్‌బి చంద్రవర్తి దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా రాధ నటించింది. అయితే ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కథా బలహీనత, ఎమోషన్‌ లోపం కారణంగా ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌ అప్పట్లో సూప‌ర్ హిట్ జంట‌గా నిలిచింది.



కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయం కృషి వంటి చిత్రాల్లో వీరి జోడీ పెద్ద హిట్స్‌ సాధించగా.. కొండవీటి రాజా కూడా అదే హిట్ జాబితాలో చేరిపోయింది. ఈ విజయంతో చిరంజీవి స్టార్‌డమ్‌ మరింత బలపడగా, బాలయ్య మాత్రం ఆ పోరులో వెనకబడిపోయాడు. అప్పట్లో చిరంజీవి–బాలయ్య అభిమానుల మధ్య ఈ పోటీ చర్చకు కారణమైంది. ఒకవైపు కొండవీటి రాజా హిట్ సెలబ్రేషన్స్‌ జరుపుకుంటే, మరోవైపు బాలయ్య సినిమా నిరాశ కలిగించింది. అయితే ఇదే పోటీ టాలీవుడ్‌లో రెండు పెద్ద హీరోల మధ్య రైవల్రీని మరింత పెంచింది. మొత్తానికి 1986 బాక్సాఫీస్ పోరులో చిరంజీవి విజయం సాధించగా, బాలయ్య మాత్రం పెద్ద షాక్‌ ఎదుర్కొన్నారు. కానీ ఇది కేవలం ఆ సంవత్సరం కథ మాత్రమే.. ఆ తర్వాతి కాలంలో బాలయ్య కూడా తన సినిమాలతో ఘనవిజయాలు సాధిస్తూ, అభిమానులకు సూపర్‌హిట్స్‌ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: