అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దేశాలను శత్రువులుగా భావిస్తున్నారు. పాకిస్థాన్ ,ఇండియా యుద్ధ వాతావరణంలో పాకిస్థాన్ కి సపోర్ట్ గానే అమెరికా వ్యవహరించింది. ఇక రష్యా తో కూడా ఆయిల్ కొనుగోలు పైన భారత్ పైన భారీగా సుంకాలు పెంచి ఎగుమతుల పైన దెబ్బ కొడుతోంది అమెరికా. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ తో ట్రంప్ డీల్ కుదుర్చుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.


చైనాతో గొడవల కోసం భారత్ తో అవసరం ఉందని స్నేహం చేసిన అమెరికా..ట్రంప్ తన ప్రయోజనాల కోసం పాకిస్థాన్ తో స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్, అమెరికాకు వ్యూహాత్మకంగానే భాగస్వామి. అమెరికాకి కూడా అవసరం. ఎందుకంటే అక్కడ సైన్యం చేతుల్లోనే ప్రభుత్వం ఉంటుంది. ఆ సైనిక అధికారి అమెరికా అధ్యక్షుడు ఏం చెబితే అది చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అమెరికా భారత్ కి దగ్గరయ్యాక.. పాకిస్థాన్ సైన్యాన్ని పట్టించుకోలేదో అప్పుడు పాకిస్థాన్ సైన్యం చైనాతో కలిసిపోయింది. దాని ద్వారా చైనా నెమ్మదిగా పాకిస్థాన్లో తమ గ్రిప్ పెంచుకుంది.అయితే ఆ తర్వాత అమెరికా వచ్చి మళ్లీ చైనాను పక్కకి నెట్టి తన మాట వినేలా చేసుకుంది..


అందుకు తోడు ట్రంప్ స్వార్థం కూడా ఉన్నది.. తన కుమారుడికి సంబంధించి క్రిప్టో కరెన్సీ కి చెందిన మైనింగ్ సెంటర్ పాకిస్థాన్లో కలదు. అలాగే అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ని క్యాష్ చేసుకోవడానికి తన కూతురికి సంబంధించినటువంటి కంపెనీలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటి కోసమే భారత్ తో ద్వేషం పెంచుకుంటున్నారు ట్రంప్. భారతదేశానికి త్వరలో క్వాడ్ సమావేశానికి వస్తారు ట్రంప్.. అదే సందర్భంలో పాకిస్థాన్ కి కూడా వెళ్తారనే విషయం కూడా వినిపిస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదని వినిపిస్తున్న నేపథ్యంలో.. షాబాషరీఫ్ ని, ఆసిఫ్ మునిని పిలుస్తున్నారు అమెరికాకు అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొక చర్చ మొదలయ్యింది. ఏది ఏమైనా ట్రంప్ స్వార్థపూరితమైన అధికారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో నష్టం ఎదుర్కోక తప్పదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: