
రెండు తెలుగు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల నుంచి వరుసగా తప్పించబడటం బాలీవుడ్ బ్యూటీ దీపిక ఫ్యాన్స్‌కి గట్టిపంచ్ వేసింది. ఈ విషయంలో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “దీపికా పదుకొనే లాంటి గ్లోబల్ స్టార్‌ను తెలుగు ఇండస్ట్రీ అవమానించింది. మా హీరోయిన్‌ని ఇలా ఇగ్నోర్ చేస్తారా?” అంటూ బాలీవుడ్ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఇంతటితో ఆగలేదు. బాలీవుడ్ సినీ పెద్దలు కూడా ఈ విషయంపై రియాక్ట్ అవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. “దీపికా మా ఇండస్ట్రీ గర్వకారణం. అలాంటి ఆమెని ఇలా పక్కన పెట్టడం మాకు అవమానం. ఇకపై ఎవ్వరూ బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల్లో నటించకూడదు. మన వాళ్లను ఇగ్నోర్ చేసే చోట మనం వెళ్ళాల్సిన అవసరం లేదు” అని కొంతమంది బాలీవుడ్ సీనియర్స్ కఠినంగా వ్యాఖ్యానించారని సమాచారం.
ఇకపోతే, ఈ విషయంపై బాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్స్ కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో “శ్తంద్ విథ్ డీపిక” అంటూ క్యాంపెయిన్స్ మొదలయ్యాయి. దీంతో మొత్తం పరిస్థితి ఇంకా హీట్ అవుతోంది. తెలుగు – బాలీవుడ్ ఇండస్ట్రీల మధ్య ఎప్పుడూ కలబోతే ఎక్కువ, గొడవలు తక్కువ. కానీ దీపిక పదుకొనే ఎపిసోడ్ వల్ల పరిస్థితి రివర్స్ అవుతుందా? నిజంగానే బాలీవుడ్ స్టార్స్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారా? లేకపోతే ఇది కేవలం గాసిపేనా? అన్నది క్లారిటీకి రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఏమయినా, ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఒక్కటే – దీపికా అవుట్ అవమానం, బాలీవుడ్ స్టార్స్ కౌంటర్ రియాక్షన్..!!