
కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన చెప్పిన డైలాగ్స్, అలాగే విలన్ చూపించిన గాంభీర్యం ట్రైలర్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమా వేరే లెవెల్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. ప్రియాంక ..పవన్ కళ్యాణ్ చేతిపై ఉన్న టాటూని గమనించి, ఆ టాటూ అర్థమేంటి అని అడిగే సీన బాగా హైలెట్ అవుతుంది. అది ఒక ఫ్యామిలీ బాండింగ్‌ను రిప్రెజెంట్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ మొత్తాన్ని చూసిన తర్వాత చాలామంది, ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కి చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని భావిస్తున్నారు.
అత్యంత హైలైట్‌గా నిలుస్తున్న ది మాత్రం ఆయన కత్తి పట్టుకుని చేసే సీన్. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఆ ఫైట్ సీన్‌లో ఫైర్‌తో కత్తి పట్టుకొని చేసే యాక్షన్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారబోతోంది అని చిన్న ట్రైలర్‌నే చెప్పేసారు మూవీ మేకర్స్. పవన్ కళ్యాణ్ ఇలాంటి సీన్స్‌ను చాలా అరుదుగానే చేసినా, ఈసారి కత్తి ఫైట్ సీన్స్ చాలా హైలైట్ అవుతాయని అర్థమవుతోంది. ఏపి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు కోరుకున్న విధంగా – మాస్, రొమాన్స్, ఎమోషన్, అన్ని ఎలివేషన్స్‌తో కూడిన విధంగా ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ఈ చిన్న ట్రైలర్‌తోనే సుజిత్ ఆ హింట్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ “ఫస్ట్ డే ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్ట్ చేస్తుందా?” అని ఎదురుచూస్తున్నారు.