సాధారణంగా పవన్ కళ్యాణ్‌ను ఇష్టపడే అభిమానులకు ఆయన స్టేజ్ స్పీచ్‌ .. మైక్ పట్టి మాట్లాడేలా కనిపించినా, అది చాలా ఇష్టంగా ఉంటుంది. ఆయన మాటలలో ఒక ప్రత్యేకమైన మధురత, ప్రభావం ఉంటుంది. అది పాలిటిక్స్‌ ఈవెంట్ అయినా, సినిమా సంబంధిత కార్యక్రమమైనా ఏదైనా సరే, పవన్ కళ్యాణ్‌ను జనాలు ఇష్టపడడానికి ప్రధాన కారణంగా ఆయన మాటలను చెప్పవచ్చు.తాజాగా జరిగిన ‘ఓ జి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయం మరోసారి స్పష్టంగా ప్రూవ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో ఒకటిగా ఉన్న ‘ఓ జి’, సుజిత్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో ప్రియాంక అర్ముళ్ మోహన్ హీరోయిన్‌గా నటించారు, అలాగే ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు.


సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్‌ ప్రత్యేక హైలైట్‌గా మారింది. ముఖ్యంగా, స్టేజిపై ఆయన పాట పాడడం, కత్తి పట్టుకొని ఇచ్చిన ఎంట్రీ సీన్ మరియు ఆయన స్వయంగా పంచుకున్న అనుభవాలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి.స్పీచ్‌లో పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ గురించి పొగిడారు. అలాగే, ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ మరియు సంగీత దర్శకుడు తమన్ ఇద్దరినీ ఆయన గుర్తు చేసుకుని, “ఈ సినిమా కోసం ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు” అని అభినందించారు.



పవన్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ..“మీరంతా ఈ సినిమా కోసం ఇంతకాలం ఎదురుచూస్తున్న విధానం ముచ్చట వేస్తుంది. గతంలో ఖుషి సినిమా టైం లో ఇది చూఅశా..మళ్ళీ ఈ జోష్, ఈ ఊపుని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చూడటం, నిజంగా సంతోషాన్ని ఇస్తుంది. సినిమాలు వదిలేసి పాలిటిక్స్‌లోకి వెళ్ళినప్పటికీ, మీరు నన్ను వదలలేదు అనిపిస్తుంది. మీరు ఇచ్చిన బలంతోనే ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నాను. నేను సినిమా ప్రేమికుడిని, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు. అదే విధంగా, జనాల సేవ చేయాలనుకున్నప్పుడు పాలిటిక్స్‌ తప్ప వేరే ఆలోచన ఉండకూడదు.” అంటూ హుందాగా మాట్లాడారు.



అంతేకాక, స్టేజ్ పై  ఆయన పాడిన పాట మరింత హైలైట్‌గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ, సినిమా కేవలం స్క్రీన్‌లోనే కాకుండా, ఆయన వ్యక్తిత్వం, స్టేజ్ ప్రెజెన్స్, పాటలు, స్పీచ్ కూడా వేరే లెవల్‌లో అనుభూతి కలిగిస్తుందనని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ఈ ఓజీతో పవన్ గట్టిగానే రికార్డ్ క్రియేట్ చేశేలా ఉన్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: