
‘ఓజి’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కనిపించబోతున్నాడు. అలాంటి ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా సుజీత్ డైరెక్షన్, థమన్ సంగీతం, పవన్ స్టైల్ మేకింగ్ అన్నీ కలిపి ‘ఓజి’ని సూపర్ హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఒకవైపు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా, పాన్ ఇండియా రేంజ్‌లో మాత్రం ఆ క్రేజ్ కనపడడం లేదు. మొదట్లోనే మేకర్స్ ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. అలా అనౌన్స్ చేసిన తర్వాత కనీసం హిందీ లేదా తమిళ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ప్రమోషన్స్ చేయాల్సింది. కానీ రిలీజ్ దగ్గర్లోకి వచ్చేసరికి కూడా ఎక్కడా ఇతర భాషల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
ట్రైలర్ రిలీజ్, పోస్టర్స్, ప్రోమో సాంగ్స్ అన్నీ కూడా కేవలం తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేస్తున్నారు. ఇతర భాషల్లో ఒక చిన్న హైప్ క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం కనిపించడం లేదు. దాంతో ఫైనల్‌గా ‘ఓజి’ రిలీజ్ పూర్తిగా తెలుగు బాక్సాఫీస్‌కే పరిమితమైపోతుందని అనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఇమేజ్ దక్షిణాది రాష్ట్రాల్లో కొంతవరకు ఉన్నా హిందీ మార్కెట్‌లో మాత్రం ఆయనకు అంతగా బేస్ లేదు. అలాంటి పరిస్థితిలో మేకర్స్ ప్రత్యేకంగా ఆడియెన్స్‌ను చేరుకునేలా ప్రయత్నించి ఉంటే పాన్ ఇండియా రేంజ్‌లో కూడా ‘ఓజి’కి క్రేజ్ వచ్చేది. కానీ అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం వల్ల ప్రస్తుతం ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే తెరకెక్కినట్టుగా అనిపిస్తోంది.
ఏదేమైనా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ క్రేజ్, సినిమా మీదున్న బజ్ దృష్ట్యా రికార్డ్ ఓపెనింగ్స్ ఖాయం. ఫస్ట్ డే నుంచి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది. అయితే పాన్ ఇండియా లెవెల్‌లో మాత్రం ఈ సినిమా అసలు ప్రభావం చూపేలా కనిపించడం లేదు. కాబట్టి ‘ఓజి’ ఫైనల్‌గా తెలుగు ఆడియెన్స్ ఫెస్టివల్‌గా మారిపోయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు