టాలీవుడ్లో ఎన్నో చిత్రాలలో నటించి తన అందంతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించింది అలనాటి హీరోయిన్ రాశి. ఇమే తమిళ్ ,హిందీ, కన్నడ, మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించింది. పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించిన రాశి.. ఈ మధ్యకాలంలో తరచూ సినిమాలలో కంటే సీరియల్స్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన సినీ కెరియర్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. వాటి గురించి చూద్దాం.


రాశి మాట్లాడుతూ తాను చెన్నైలో తెలుగు కుటుంబంలో పుట్టినప్పటికి  తనకి చిన్న వయసు నుంచే మేకప్ వేసుకోవడం ఇష్టం లేదని.. తాను అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చానని ఒక్కసారి యాక్టింగ్ ఫీడ్ లో అడుగుపెట్టిన తర్వాత  తాను చేస్తున్న  పనిని ఎప్పుడూ కూడా తాను తక్కువగా చూసుకోలేదని తన పనిని తాను గౌరవిస్తానని తెలిపింది. సినిమాలలో నటిస్తున్న సమయంలో తాను చిరంజీవితో ఒక సినిమా చేయవలసి ఉంది. ఆర్తి అగర్వాల్ కు తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని.. కానీ డైరెక్టర్ తో చిరంజీవి విభేదాల కారణంగా ఆ సినిమా ఆగిపోయిందని తెలిపారు.

అలాగే రంగస్థలం సినిమా సమయంలో మొదట రంగమ్మత పాత్ర ఆఫర్ చేశారని ఆ సమయంలో తనని అభిమానులు, ప్రేక్షకులు  యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే భయంతో ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశానని.. 2004లో తనకు వివాహమైంది.. అలా వివాహమైన పదేళ్లకు తనకు పాప పుట్టిందని అదే తన జీవితంలో పెద్ద మ్యాజిక్ అంటూ తెలిపింది.  డైరెక్టర్ తేజ నిజం సినిమాలో తన క్యారెక్టర్ ని చాలా పాజిటివ్ అని చెప్పారు. మొదటి రోజు తనతో చేయకూడని సీన్ చేయించారని..అయితే ఆ సన్నివేశం ఉంటుందనే విషయాన్ని తనకి చెప్పలేదు. ఆ విషయం పైన చాలా హర్ట్ అయ్యానని..ఆ తర్వాత సీన్స్  చేయమని చెప్పిన తాను నేను అలాంటి పాత్రలు చేయలేనని.. కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుందని నో అని చెప్పా..కానీ వినకుండానే చేయాల్సిందేనన్నారు.  అయిష్టంగానే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయించారంటూ తెలిపింది రాశి.

మరింత సమాచారం తెలుసుకోండి: