ఈ మధ్యకాలంలో రకరకాల కొత్త వ్యాధులు జనాలను భయపెడుతున్నాయి. ఒకప్పుడు వయస్సు మీద పడిన వాళ్లకే షుగర్, బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్‌లాంటి జబ్బులు వస్తాయని వినేవాళ్లం. కానీ ఇప్పుడు మాత్రం చిన్న వయసులోనే – 25, 30, 35 లోపు వయసు ఉన్నవారికీ రకరకాల వింత వ్యాధులు వస్తున్నాయి. 25 ఏళ్లు దాటగానే షుగర్, 30 ఏళ్లు దాటగానే బీపీ ఇలా రకరకాల కొత్త వ్యాధులు మనుషులను భయపెడుతున్నాయి. దీనంతటికీ మూల కారణం మనం తీసుకునే ఆహారం, మారిన ఆహారపు అలవాట్లే అని డాక్టర్లు చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా సరైన డైట్ పాటించకపోవడం ఇక్కడ చింతించాల్సిన విషయం. అయితే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం, జీవనశైలిలో కొన్ని మంచి అలవాట్లు చేర్చుకోవడం వలన ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా తినే ఫుడ్ టైమింగ్ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.


తప్పు టైంలో పోషకాహారం తీసుకుంటే దాని ప్రయోజనం ఉండదని డాక్టర్లు క్లారిటీ ఇస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితమే గడుపుతున్నారు నేటి జనాలు. ఉదయం హడావిడిగా ఆఫీసులకు రెడీ అవుతారు, మధ్యాహ్నం వండుకొని క్యారియర్లు తీసుకొని మెట్రోలో, కార్లలో, బస్సుల్లో ఉద్యోగాలకి వెళ్తారు. ఇక రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకుంటారు. ఆ రాత్రి సమయమే వారికి తీరికగా ఉంటుంది. ఆ కారణంగా రాత్రిపూట పుష్టిగా తినాలని అనుకుని రకరకాల ఫుడ్ తింటారు. కానీ ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది అంటున్నారు డాక్టర్లు. మసాలా, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారం రాత్రిపూట తీసుకుంటే నిద్రను ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కొన్ని ఫుడ్స్ రాత్రిపూట అసలు తీసుకోకూడదని కూడా చెబుతున్నారు. అవేంటో చూద్దాం:



మాంసాహారం – రాత్రిపూట చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై తినేసి పడుకునే వారు చాలామంది ఉంటారు. కానీ ఇది చాలా తప్పు అంటున్నారు డాక్టర్లు. అవి సరిగ్గా జీర్ణం కాకుండా కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. తినాలనిపిస్తే సాయంత్రం 5:30–6:00 లోపు తినేయాలి. ఆ తర్వాత కనీసం నాలుగు గంటలు నిద్రపోకుండా ఏదో ఒక పని చేయాలని సూచిస్తున్నారు.



ఆరెంజ్ జ్యూస్ – సాధారణంగా రాత్రిపూట సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న పండ్లు, కాయగూరలు తినకపోవడం మంచిది. ఇది పేగులకు కూడా మంచిది కాదు అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్‌లో ఎక్కువ సిట్రిక్ కంటెంట్ ఉండటంతో రాత్రిపూట తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.


బీట్రూట్ – బీట్రూట్‌లో చాలా పోషకాలు ఉన్నా రాత్రివేళ తినడం మంచిది కాదు అంటున్నారు డాక్టర్లు. రాత్రి బీట్రూట్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయట.



ఆల్కహాల్ – రాత్రివేళ సిట్టింగ్స్ పేరిట ఆల్కహాల్ తాగే వారు ఎక్కువ. కానీ రాత్రిపూట మద్యం సేవించడం వల్ల అధికంగా కొవ్వు పేరుకుపోతుంది. ఇది చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.



ఇవే కాదు స్వీట్స్, ఐస్ క్రీంస్ మరికొన్ని హై ల్యాలరీ ఫుడ్స్ కూడా రాత్రి పూట తీసుకోకూడదు అంటున్నారు డాక్టర్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: