- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “ఓజి”. ఈ సినిమాపై మొదటి రోజు నుంచి ఉన్న అంచనాలు రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, సినిమా బజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఆదివారం నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆ అంచనాలను మళ్లీ ఎత్త‌కు వెళ్లేలా చేసింది. ఈ ఈవెంట్‌లో వర్షం కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడినా, మూవీ యూనిట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన స్పీచ్ ఈ ఈవెంట్ హైలైట్‌గా మారింది. ఆయన పెద్దగా మాట్లాడకుండా, చాలా సింపుల్‌గా కానీ పవర్ఫుల్‌గా తన కాన్ఫిడెన్స్‌ని బయటపెట్టాడు. “ఓజి కోసం చెప్పడం కాదు” అంటూ మీసం మెలేసిన స్టైల్‌లో ఒక మాస్ రివ్యూ ఇచ్చాడు. అదే ఒక్క లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా థమన్ “ఓజి తో అందరికీ సమాధానం చెబుతున్నాం” అంటూ తన కాన్ఫిడెన్స్‌ని చూపించాడు. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో నమ్మకాన్ని ప్రదర్శించడం, ఈ సినిమాపై ప‌వ‌న్‌కు ఉన్న కాన్ఫిడెన్స్‌కు నిద‌ర్శ‌నం. థమన్ స్టైల్, ఆయన ఇచ్చిన చిన్న మాస్ రివ్యూ చూసి ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. మొత్తానికి థమన్ మాటలు, ఆయన చూపించిన కాన్ఫిడెన్స్ వలన “ఓజి”పై ఉన్న హైప్ మళ్లీ రెట్టింపైంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ డే రివ్యూల కోసం భారీ ఆసక్తి నెలకొంది. థమన్ రివ్యూ ఒక్కటే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఓజి కోసం హంగామా మరింత పెంచేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: