- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక తప్పనిసరి అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నోటిఫికేషన్ వ‌చ్చే ఛాన్సులు ఉండ‌డంతో అన్ని పార్టీలు సీరియస్‌గా రెడీ అవుతున్నాయి. ఈ సీటు ప్రతిష్టాత్మకంగా మారడంతో పోటీ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బీఆర్ఎస్ విషయానికి వస్తే, చాలా పేర్లను పరిశీలించినా చివరికి మాగంటి సునీతకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా, పార్టీ లోపల స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే సునీత జూబ్లిహిల్స్‌లో ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ పార్టీలో ఎక్కువగా కొత్త పేర్లు రాకపోవడంతో క్లారిటీ ఉంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఆ పార్టీలో నేతలంతా రేసులోకి దిగిపోవడంతో గందరగోళం నెలకొంది. గెలిస్తే మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఎవరూ తగ్గడం లేదు.


మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నుంచి మాజీ మంత్రి దానం పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పాత నాయకుల వారసులు కూడా టిక్కెట్ కోసం ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల పార్టీ క్యాడర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది. కాంగ్రెస్‌లో ఓ సంప్రదాయం ఉంది. అభ్యర్థి పేరును చివరి క్షణం వరకు ప్రకటించరు. అందుకే ఇప్పుడూ అందరికీ ఆశ చూపుతున్నారు. కానీ ఈ తీరుతో చివరికి టిక్కెట్ రాకపోయిన వాళ్లు అసంతృప్తితో పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంది. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది కాబట్టి ముందుగానే అభ్యర్థి క్లారిటీ ఇస్తే మిగిలినవాళ్లు సైలెంట్ అవుతారు. రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్‌నే అభ్యర్థిగా అనుకుంటున్నారని గట్టి ప్రచారం జరుగుతోంది.


మొత్తం మీద జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో అధికార పార్టీ అనుభవం ఉన్నా, నగరంలోని ఈ సీటులో సెంటిమెంట్లు, కులం, పార్టీ బలం పెద్దగా ప్రభావం చూపవు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ ఈ విషయంలో హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూడకుండా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: