
అయితే, ఇప్పుడు కొద్ది నిమిషాల ముందు సుజిత్ అసలు అనుకున్నట్టుగా, పూర్తి మేకోవర్‌తో ఫైనల్ వర్షన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. తమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్, విలన్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ — ఇవన్నీ కలిసి ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా, క్లైమాక్స్‌లోని పంచ్ డైలాగ్ మాత్రం ట్రైలర్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. "అత్తారింటికి దారేదిలో" పవన్ కళ్యాణ్ చెప్పిన "లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప…"డైలాగ్ ఎలా గూస్బంప్స్ తెప్పించిందో, అదే తరహాలో " నా కొడకల్లారా!" అంటూ ఆయన చెప్పిన ఆఖరి మాటలు వినగానే అభిమానులు పులకరించారు. ఆ ఒక్క మాటతోనే సోషల్ మీడియా షేక్ అయిపోయింది.
నిజానికి, ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతగా మాస్, ఫుల్ ఎనర్జీతో డైలాగ్ చెప్పడం ఇదే మొదటిసారి. సినిమా కోసం, అభిమానుల కోసం తన స్టైల్‌ని తిరిగి చూపించడానికి ఆయన రూల్స్ బ్రేక్ చేయడం అభిమానుల్లో ఆనందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాపై ఆయన ఎంతగానో శ్రద్ధ పెట్టారన్న విషయం అభిమానులకు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కడ చూసినా "ఓజీ" ట్రైలర్ గురించే చర్చలు. చాలా మంది సినీ ప్రేమికులు ట్రైలర్ చూసిన వెంటనే "చించిపడేశాడు… ఇది మొదటి రోజే 100 కోట్లు దాటడం ఖాయం!" అంటూ రాసిపెడుతున్నారు. అంతటి బజ్, అంతటి హైప్ సాధించడం చాలా అరుదు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో రికార్డులు మాత్రమే కాదు, రచ్చ రంబోలాలు చేసే రేంజ్‌లో కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు అన్న నమ్మకం పండింది.
ఒక్కమాటలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం గట్టిగా ప్లాన్ చేశాడు. ఇది మామూలు రికార్డ్స్ క్రియేట్ చేయదు. ఇది మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ గట్టిగా చెబుతున్నారు: “గెట్ రెడీ… పవన్ కళ్యాణ్ ఓజీతో రానున్న తుఫాన్‌ను ఎవరూ ఆపలేరు!”