ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుకునే పేరు ఒక్కటే—సుజిత్… సుజిత్… సుజిత్!. నిన్నటి వరకు సుజిత్ అంటే కేవలం ఒక డైరెక్టర్. ప్రభాస్ వంటి స్టార్ హీరోతో కలిసి ఒక పెద్ద సినిమా చేయడానికి ప్రయత్నించి, కానీ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయి, ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్. చాలా మంది దృష్టిలో ఆయన కెరీర్ రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయిందనే భావన నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ మీద ఆయన ఉంచిన ధీమా, ఆత్మవిశ్వాసం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.


కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "ఓజీ" సినిమాతో పాటు, ముఖ్యంగా నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వల్ల సుజిత్ పేరు కొత్త రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయనను రాజకీయ రంగంలో మాత్రమే చూసే అవకాశం అభిమానులకు ఎక్కువగా దొరికింది. సినిమా వైపు నుండి ఆయన పంచే మాస్ హంగామా, లవబుల్ యాక్టింగ్, పవర్‌ఫుల్ యాక్షన్ అన్నీ అభిమానులు చాలా మిస్ అయ్యారు.
జానీ సినిమాలోని ఆయన ఆగ్రహం, గుడుంబా శంకర్‌లోని ఆయన నాటకీయత, ఖుషి సినిమాలోని ఆయన లవబుల్ పెర్ఫార్మెన్స్—ఇవన్నీ చూసే అవకాశం ఎప్పటినుంచో ఫ్యాన్స్‌కి రాలేదు. కానీ ఇవన్నీ మళ్లీ గుర్తు చేసేలా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సుజిత్ -పవన్ కళ్యాణ్‌ని ప్రెజెంట్ చేయించాడు. సినిమా పక్కన పెడితే, ఆ ఈవెంట్ ఫ్యాన్స్‌కి ఒక లైఫ్‌టైమ్ మెమరీగా మిగిలిపోతుందని చెప్పాలి.



అభిమానులు ఊహించనివిధంగా పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద కత్తి పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. మైక్ పట్టుకొని ఓ రేంజ్‌లో ఊగిపోతూ పాటలు పాడారు. అంతే కాదు—"నేను డిప్యూటీ సీఎం అని కూడా మరిచిపోయాను" అంటూ ఆయన స్వయంగా చెప్పుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ఎలక్ట్రిక్‌గా మార్చింది. తమన్, సుజిత్ తమ టీమ్‌లోకి లాగేశారని ఆయన సరదాగా కామెంట్ చేయడం ఈవెంట్‌లో అత్యంత హైలెట్‌గా మారింది.



దీంతో సోషల్ మీడియాలో సుజిత్‌ని అభిమానులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. కొంతమంది సరదాగా "ఏం మందు పెట్టావ్ సుజిత్, పవన్ గారిని ఇలా ఊగిపోనిచ్చావ్?" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ట్రోల్స్ చేస్తూ, "డ్రగ్స్ ఇచ్చి ఉంటాడా? అందుకే ఇలా ఊగిపోతున్నాడు" అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. కానీ వీటన్నిటిని ఫ్యాన్స్ ఏం పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల భావన మాత్రం ఒక్కటే—"డోంట్ వర్రీ… ఓజీ పొజిషన్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది!" అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: