చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ హైప్ ఏర్పడిన చిత్రం ఓజి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఎప్పుడైతే గ్లింప్స్ వైరల్ గా మారిందొ అప్పటినుంచి ట్రైలర్ వరకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తుందని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యేలా చేసింది. డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరు ట్రైలర్లో అద్భుతంగా ఆకట్టుకుంది. విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మిన్ కూడా అద్భుతంగా చూపించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా చూడడానికి ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు.


సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ.175 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సినిమాకు ఇది పెద్ద టార్గెట్ గానే మారింది. అయితే నాన్ థియేట్రికల్ గా కూడా బాగానే జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి హక్కులు రూ .80 కోట్ల రూపాయల వరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ .32 కోట్లు అమ్ముడుపోయాయని సమాచారం. ఓజి చిత్రానికి సంబంధించి శాటిలైట్ రైట్స్ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదు. శాట్ లైట్ రైట్స్ ద్వారా కనీసం రూ .10 కోట్ల వరకు రావచ్చు.


ఓజి సినిమా నాన్ థియేటర్లు బిజినెస్ రూ.120 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టే.. ఇక థియేటర్ బిజినెస్ రూ .175 కోట్ల రూపాయల వరకు కలుపుకొని మొత్తం మీద ఈ సినిమా రూ. 295 కోట్ల రూపాయల వరకు ఓజీ సినిమా బిజినెస్ జరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా రూ .200 కోట్లకు పైగా ఉంది. దీంతో రిలీజ్ కి ముందే ఓజీ సినిమా లాభాలలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఓజి ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: