జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా, సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి బాగానే ఆకట్టుకుంటోంది. ఇటీవలే టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. రీతూ చౌదరి, తన భర్తతో అఫైర్ పెట్టుకుంది అంటూ ఎన్నోసార్లు అర్థరాత్రి ఇంటికి వచ్చేది అంటూ అందుకు సంబంధించి సిసి వీడియోలను కూడా షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


ముఖ్యంగా గౌతమి గర్భంతో ఉన్నప్పుడు మహేష్, రీతూ చాలా దగ్గర అయిపోయారు అంటూ గౌతమి వెల్లడించింది. గౌతమి షేర్ చేసిన వీడియోలు కూడా వైరల్ గా మారడంతో ఈ వీడియోల పైన నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా హౌస్ లో ఉన్న రీతూ చౌదరికి తెలిసి అవకాశం మాత్రం లేదు? ఒకవేళ తెలిస్తే ఎలా స్పందిస్తుందో చూడాలి. తాజాగా ఈ విషయం పైన హీరో ధర్మ మహేష్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.


బయట ఎవరో ఏదో అనుకుంటున్నాట్లుగా నాకు, రీతూ చౌదరి మధ్య ఎలాంటి అఫైర్ లేదని.. మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే! తనను ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూస్తానని.. గౌతమి మా బెడ్ రూమ్ ఫుటేజ్ లు ఉన్నాయి అంటోంది కావాలంటే రిలీజ్ చేసుకోమనండి అంటూ తెలియజేశారు ధర్మ మహేష్. నా కొడుకుని నాకు చూపించడం లేదు. ఈ వ్యవహారంతో నేను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. సెటిల్మెంట్ చేస్తేనే తన బిడ్డను చూపిస్తానని బెదిరిస్తున్నారు. ఈ గొడవలలో తన కొడుకుని లాగడం సరైనది కాదు అంటూ హీరో ధర్మ మహేష్ తెలియజేశారు. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరుని నాశనం చేశారు.. గౌతమి చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అంటూ మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: