స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన ఏదైనా ప్రత్యేకమైన రోజు లేదా ప్రత్యేకమైన క్షణం వస్తే, అభిమానులు దాన్ని ఎప్పటికీ మిస్ చేసుకోరు. ఆ హీరో ఫ్యాన్స్ కూడా కొన్నిసార్లు ఆ రోజును మరచిపోవచ్చు కానీ నిజమైన అభిమానులు మాత్రం ఆ రోజును ఒక గుర్తుగా గుర్తుంచుకొని, ఎంతో ఉత్సాహంగా, ఎంతో గౌరవంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు సోషల్ మీడియా వేదికలపై విపరీతమైన ట్రెండ్‌గా మారిపోతాయి. అందులో భాగంగానే, జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో మరపురాని రోజు 2024 సెప్టెంబర్ 27. అదే రోజు ఆయన తన 30వ సినిమా “దేవర” ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా విడుదలైన రోజున థియేటర్ల వద్ద ఏర్పడిన సంబరాలు, అభిమానుల హడావిడి, ఉత్సాహం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. నందమూరి అభిమానులకే కాదు, సినీప్రేక్షకులందరికీ అది ఒక ప్రత్యేకమైన అనుభూతి.


ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వి కపూర్ నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయి రీచ్ సాధించకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ నటన మాత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ నటనను గర్వంగా చర్చించుకున్నారు. కలెక్షన్స్ పరంగా సినిమా పెద్ద రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో “దేవర” ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే, ఇది ఆయన బాహుబలి-లాంటిదైన బిగ్ బ్లాక్‌బస్టర్ “RRR” తర్వాత నటించిన సినిమా కావడం గమనార్హం. అందువల్ల ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.



ఇప్పుడు ఈ సినిమా విడుదలై నేటికి ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో “దేవర”కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు తమ అభిమాన హీరో సినిమా వార్షికోత్సవాన్ని ఎంతో పండుగలా జరుపుకుంటున్నారు. నందమూరి అభిమానుల దృష్టిలో “దేవర” ఒక సినిమా మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన గుర్తు. అందుకే వాళ్లకి ఇది స్పెషల్ డేఅ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: