‘దేవర’ కేవలం ఒక సినిమా పేరు మాత్రమే కాదు, నందమూరి అభిమానులకు ఇది ఎంతో ఎమోషనల్‌గా అనుబంధమైన సినిమా. ‘దేవర’ సినిమా రిలీజ్ అయిన తర్వాత, చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమా తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఇదే. ఈ సినిమా కోసం అభిమానులు రిలీజ్ టైమ్‌కి ముందే క్యూ కట్టి, థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన క్షణాలు అందరికీ గుర్తున్నాయి. ఈ సినిమా విడుదలై ఇప్పటివరకు ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ‘దేవర’ సినిమాకి సంబంధించిన రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఇదే సందర్భంలో, అసలు ఈ సినిమా కథను కొరటాల శివ ఎవరికి మొదటగా వివరించారో, ఏ హీరోతో తెరకెక్కించాలనుకున్నారో అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మొదటగా, ఈ కథను కొరటాల శివ ..అల్లు అర్జున్‌కు వివరించారు. అల్లు అర్జున్సినిమా చేయడానికి ఓకే కూడా చెప్పాడు .  ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కూడా, కొరటాల శివ ఈ కథ అల్లు అర్జున్‌తోనే తెరకెక్కిస్తాడని అందరూ అనుకున్నారు. తదుపరి, కొరటాల శివ కథలో కొన్ని మార్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్‌కు వివరించగా, ఆయన ఈ కథతో ఇంప్రెస్ అయ్యారు. ఆ కారణంగానే, ఈ సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు. ప్రారంభంలో, ఒక భాగంతోనే తనకు సరిపోతుందని భావించిన ఆయన, కానీ కథ పూర్తిగా ప్రేక్షకులకు చెప్పలేము అనే కాన్సెప్ట్‌ని బట్టి, సినిమా రెండు భాగాలుగా జరగాలని డిసైడ్ చేశారు.



మొదటి భాగం ఇప్పటికే రిలీజ్ అయ్యింది. రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని వార్తలు వెలువడాయి. ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కాకుండా అల్లు అర్జున్ నటించేవారేమో. కానీ దేవుడు ఎప్పుడు, ఎవరికీ, ఎలా ఏం చేయాలో బాగా తెలుసు కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్‌కి ఈ సినిమా సొంతం కావడం జరిగింది అని అభిమానులు చెప్పుకుంటున్నారు."

మరింత సమాచారం తెలుసుకోండి: