దేవర సినిమా రిలీజ్ అయిన నేటికి సంవత్సరం పూర్తయింది.   ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో “దేవర” సినిమా గురించి ప్రత్యేకంగా చర్చలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ , ప్రేక్షకులు మరీ ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ ఎలా పెట్టరు..? దర్శకుడు కోరటాల శివ ఈ కథలో ముందుగా హీరోగా ఎవరిని ఎంపిక చేశారు..? హీరోయిన్గా జాన్వి కపూర్ ని ఎందుకు తీసుకున్నారు..? అలాగే సినిమా కథలో ఏ విధంగా మలుపులు వచ్చాయి  అనే విషయాలు ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.


ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం పూర్తయిన సందర్భంగా, సినిమాకు సంబంధించిన హైలెట్ పాయింట్స్‌ను ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.  ఈ సినిమాలో కథ కన్నా ఎక్కువ హైలెట్ అయిన అంశం ఏమిటంటే, అది అనిరుద్ సమర్పించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. అంతేకాక, సినిమా రిలీజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ ల మధ్య వచ్చిన  డైలాగ్ సీన్స్ కన్నా కూడా, “చుట్టుమల్లె” పాట ఎక్కువగా ట్రెండ్ అయింది. యూట్యూబ్‌లో ఈ పాట నంబర్ వన్ రేంజ్‌లో ట్రెండ్ అయింది. సినిమా రిలీజ్ అయిన ఒక సంవత్సరం అయినప్పటికీ, ఏదైనా ఈవెంట్, ఫంక్షన్ లేదా అకేషన్ ఉంటే  కూడా ఈ పాట కచ్చితంగా  ప్లే చేస్తారు.


కుర్రాళ్లు, పెద్దవాళ్లు, అమ్మాయిలు ఈ పాటకు ఎంత చక్కగా డాన్స్ చేస్తూ, మెలికలు తిరిగారో అందరికీ గుర్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ పాటపై రీల్స్ చేస్తూ ఆనందపడుతున్నారు. కోరటాల మాస్టర్ మైండ్ ఈ పాటకు బాగా సూట్ అయ్యింది  అప్పట్లో ఫ్యాన్స్ ఇదే అంశం గురించి బాగా చర్చించారు. అందుకే, ఈ సినిమా టాక్ అటూ ఇటూ ఉన్నా, “చుట్టుమల్లె” పాట మాత్రం వెర్రీ హైలైట్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ అయి సంవత్సరం అయిన శుభ సందర్భంలో, నేడు  “దేవర 2”పై ఏదైనా అప్డేట్ ఉంటుందా..? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి దీని గురించి చిత్ర బృందం ఎలా స్పందిస్తుందొ..??? 

మరింత సమాచారం తెలుసుకోండి: