- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పై ఫొటోలో క‌నిపిస్తోన్న హీరోయిన్ నంద‌మూరి హీరోయిన్ గా పాపుల‌ర్ అయ్యారు. ఆమె పాత త‌రంలో స్టార్ న‌టీమ‌ణి.
ఎన్టీఆర్ తో ఒకే ఒక చిత్రం రాములో కథానాయిక నటించిన పుష్పలత తమిళనాడుకు చెందిన నటీమణి, ప్రముఖ నటుడు ఏ.వి. ఎమ్.రాజన్ భార్య. తెలుగులో రాము చిత్రం లో ఎన్టీఆర్ భార్యగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ - పుష్ప‌ల‌త పై చిత్రించిన "పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు. రెండు" పాట ప్రసిద్ధి చెందింది, తదనంతరం ఎన్టీఆర్ గారి స్వంతచిత్రాలలో ప్రముఖ పాత్రలు పోషించారు, అన్నదమ్ముల అనుబంధం లో తల్లిగా ఆమెపై చిత్రించిన " అనాటి హృదయాల ఆనందంగీతం " పాట ట్రెండ్ సెట్టర్.
 

అలాగే వేటగాడు లో " "ఇది పువ్వులు పూయనితోట " గీతం ప్రసిద్ధి చెందింది. అలాగే బొబ్బిలి పులి చిత్రం లో తల్లిపాత్ర లో ఆమె మరణించినప్పుడు చిత్రించిన " జననీ జన్మభూమీతా" గీతం చరిత్ర సృష్టించింది. శ్రీ మద్విరాట పర్వం లో సుధేష్ణ , తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం లో ఆకాశరాజు భార్య వంటి ముఖ్య పాత్రలు పోషించారు, వినాయక విజయం లో ఆదిపరాశక్తిగా నటించారు. వర్ణ యుగం లో శతాధిక చిత్రాల్లో గౌరవ పాత్రలు పోషించారు. ఈమె కుమార్తె " మహాలక్షి" కన్నడలో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: