సాధారణంగా సోషల్ మీడియాలో స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురి అవ్వదు. ఆమె చాలా సైలెంట్ నేచర్ ఉన్న వ్యక్తి. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకుంటూ, కుటుంబంతో టైమ్ గడపడం, పిల్లల పెంపకం, సోషల్ సర్వీస్ వంటి అంశాలపై మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఇక స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందంటే అది ఫ్యాషన్ ఫొటోలు పోస్ట్ చేయడం కోసం కాదు, సమాజానికి ఉపయోగపడే వీడియోలు, టిప్స్ షేర్ చేయడం కోసం. ముఖ్యంగా పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ అవ్వాలి, పిల్లల్లో పాజిటివ్ అటిట్యూడ్ ఎలా పెంచాలి అనే అంశాలపై ఆమె చెప్పిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు “స్నేహా రెడ్డి అంటే బన్నీ భార్య మాత్రమే కాదు, సమాజానికి మంచి సూచనలు చెప్పే సెన్సిబుల్ ఉమెన్” అంటూ పొగడ్తలు కురిపించారు.


ఇంతకాలం సోషల్ మీడియాలో పాజిటివ్ క్లబ్‌లో ఉన్న స్నేహా రెడ్డి, తాజాగా మాత్రం ఫస్ట్ టైమ్ ట్రోలింగ్‌కి గురవుతున్నారు. కారణం ఏమిటంటే — అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఇటీవల తన నిశ్చితార్థం చేసుకున్నాడని ప్రకటించాడు. ఆ నిశ్చితార్థం జరిగిన అమ్మాయి పేరు నైనిక. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, ఇప్పుడు అధికారికంగా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. కానీ ఈ నైనిక ఎవరు అని వెతికిన నెటిజన్లు ఒక సెన్సేషనల్ డీటైల్ బయటపెట్టారు. ఆమె స్నేహా రెడ్డి కజిన్ (బంధువు) అని వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.



ఇంతవరకు అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి కానీ, ఇక్కడి నుంచే ట్రోలింగ్ మొదలైంది. కొంతమంది నెటిజన్లు స్నేహా రెడ్డిపై విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. “ఆస్తి పక్కకి పోకుండా చూసుకోవడానికి సెట్ చేసిందా?”,“బన్నీ నీ మాటే వింటాడని అందుకే ఈ మ్యాచింగ్ చేసావా?” అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై మరోవైపు కొంతమంది మాత్రం స్నేహా రెడ్డిని డిఫెండ్ చేస్తున్నారు. “ఏమయినా సరే, శిరీష్ పెళ్లి అవుతుందంటే అదే చాలు. ఎవరికీ హాని జరగలేదు. అదీ వాళ్ల కుటుంబంలోనే జరిగిందంటే దాంట్లో తప్పేంటి?” అంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.



అయితే అభిమానుల పెద్ద వర్గం మాత్రం ఒకే మాట అంటోంది — “స్నేహా రెడ్డి ఎప్పుడూ డబ్బు మీద మోజు చూపించలేదు. ఆమె నిజాయితీగా జీవించే మహిళ. ఇలాంటి వ్యక్తిని ఇలా ట్రోల్ చేయడం సరికాదు.” అంటున్నారు. ఇక స్నేహా రెడ్డి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో రిక్వెస్ట్ చేస్తున్నారు — “దయచేసి స్నేహా గారిని ట్రోల్ చేయడం ఆపండి. ఆమె ఆస్తి కోసం కాదు, కుటుంబ సమన్వయం కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయాలకు సపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు” అంటున్నారు. మొత్తానికి ఇప్పటివరకు సోషల్ మీడియాలో పాజిటివ్ ఇమేజ్ కలిగిన స్నేహా రెడ్డి, ఇప్పుడు మాత్రం అల్లు శిరీష్–నైనిక నిశ్చితార్థం కారణంగా అనుకోకుండా ట్రోలింగ్ వేవ్‌లో పడిపోయారు. ఎవరేమన్నా, ఈ సంఘటనతో బన్నీ భార్య సోషల్ మీడియాలో చర్చల కేంద్రంగా మారిపోయింది అనేది మాత్రం నిజం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: