టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ ప్రియాంక మోహన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించింది. ఈ చిత్రంలో ఈమె నటనకు మరొకసారి గుర్తింపు సంపాదించుకుంది. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలలో ప్రియాంక మోహన్ చాలా హాట్ గా యువతను రెచ్చగొట్టేలా తన అందాలను ప్రదర్శించినట్లు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.


దీంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.. మరి కొంతమంది తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కానీ ఈ ఫోటోలు చూస్తూ ఉంటే మాత్రం అవి ఏఐతో క్రియేట్ చేసిన ఫోటోలు అన్నట్లుగా కనిపిస్తున్నాయనీ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా ఈ ఫోటోల పైన ప్రియాంక మోహన్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇస్తూ.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు కొన్ని AI జనరేటర్ ఫోటోలను కావాలని కొంతమంది సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారని దయచేసి ఇలాంటి నకిలీ దృశ్యాలను షేర్ చేయడం మానండి అంటూ కోరింది.



ఏఐని నైతిక సృజనాత్మక వాటికోసం ఉపయోగించుకోవాలని కానీ ఇలాంటి తప్పుడు సమాచారం కోసం ఉపయోగించడం మంచిది కాదు అంటూ తెలియజేసింది. మనం ఎలాంటివి సృష్టిస్తున్నామో ,ఏవి పంచుకుంటున్నామో అనే విషయం పైన జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రియాంక మోహన్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ ఫోటోల పైన ప్రియాంక మోహన్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మొదట తెలుగు ఇండస్ట్రీలోకి నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత తమిళంలో డాక్టర్ సినిమాతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ప్రియాంక మోహన్. తెలుగు తమిళం భాషలలో  పలు చిత్రాలతో బిజీగా ఉంది.ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే కవిన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: