
ఈ ఒక్క వీడియో చూసి ప్రభాస్ అభిమానులు పులకరించిపోతున్నారు. “చాలా కాలం తర్వాత మళ్లీ మన డార్లింగ్ ఇలా సాలిడ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు!”, “మారుతి దిమ్మతిరిగే షాట్ కట్టేశాడు!”, “ఇది కేవలం ఐటెం సాంగ్ లుక్ మాత్రమే అయితే, సినిమా రేంజ్ ఊహించండి!” అంటూ కామెంట్స్‌తో సోషల్ మీడియాను ఫ్యాన్స్ ఊపేస్తున్నారు. మరోవైపు, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మారుతి గురించి కూడా చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మొదట్లో కొంతమంది “మారుతి కి ప్రభాస్ ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు?”, “ఇదంతా మాస్ ఇమేజ్‌కు తగ్గదేనా?” అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు లీక్ అయిన లుక్ చూసిన తర్వాత అదే ఫ్యాన్స్ “మారుతిని నమ్మి ఇచ్చిన ప్రభాస్ డెసిషన్ సూపర్!”, “మారుతి రిజెక్ట్ చేయలేని రేంజ్‌లో చూపిస్తున్నాడు డార్లింగ్‌ని!” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
అంతేకాదు, ఈ లుక్ తో ‘రాజా సాబ్ ’ సినిమా ఏ స్థాయిలో హీట్ క్రియేట్ చేయబోతోందో అందరికీ క్లియర్ అయిపోయింది. ప్రభాస్ ఎనర్జీ, మారుతి స్టైల్, మాస్ ఎలిమెంట్స్ కలిస్తే థియేటర్స్ మొత్తం దద్దరిల్లడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యే రోజున థియేటర్స్ లో సీట్స్ లో కూర్చోలేరు.. ఫ్యాన్స్ కేకలతో స్క్రీన్స్ కంపించడం ఖాయం అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సరదాగా, కాన్ఫిడెంట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లీక్ అయిన పిక్ వైరల్ అవుతూ, ప్రతి ఫ్యాన్ అకౌంట్ లో షేర్ అవుతోంది. #Rajasabha, #PrabhasMassLook, #MaruthiMagic లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రభాస్ మాస్ లుక్ చూసిన తర్వాత ఒక్క మాటే వినిపిస్తోంది — “డార్లింగ్ ఈ సారి కేవలం సినిమా కాదు... వేడెక్కే ఫెస్ట్!”