పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంకో సంవత్సరమే ఇలా ఉంటా అంటూ మాట్లాడి సంచలనం సృష్టించింది. మరి ఇంతకీ రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి..ఎందుకు అలాంటి మాటలు మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. బద్రి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్సినిమా చేసే సమయంలో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది. అలా ఈయనతో కలిసి జానీ మూవీలో కూడా నటించింది. ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులకు అది చాలా ఫేవరెట్ మూవీ. అయితే పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత రేణు దేశాయ్ సినిమాలే మానేసింది. అంతేకాదు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి మెగా ఫ్యామిలీలో కోడలుగా మంచి పేరు తెచ్చుకుంది. కానీ చివరికి రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు.

 ఇక వీరి విడాకులకు కారణం పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవాతో ప్రేమలో ఉండడమే అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ జల్సా మూవీ చేసే సమయంలో అన్నా లెజ్నోవాతో ప్రేమలో పడి రేణు దేశాయ్ ని వదిలేసారనే టాక్ వినిపించింది. అందుకే రేణుదేశాయ్ భర్త మరో మహిళతో ఉండడం సహించక ఆయనకు విడాకులు ఇచ్చిందని అంటుంటారు. అయితే ఆ మధ్యకాలంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటానంటే కొంతమంది పవన్ ఫ్యాన్స్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. మీరు పవన్ కి మాత్రమే భార్య అని అన్నారు.కానీ వారి వార్నింగ్ కు రేణు దేశాయ్ కూడా కౌంటర్ ఇచ్చింది. నేను మీ అన్నను వదిలేయలేదు. నన్నే మీ అన్న వదిలేసాడు.

 మీ అన్న నన్ను వదిలేసి వేరే అమ్మాయిని చేసుకున్నప్పుడు నేను వేరే అబ్బాయిని చేసుకుంటే పోయేదేముంది అన్నట్లుగా స్పందించింది. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో నేను ఇంకో సంవత్సరమే ఇలా ఉంటానని,సంవత్సరం తర్వాత సన్యాసం తీసుకొని ఆశ్రమానికి వెళ్లి సన్యాసుల్లో కలిసి పోతానని చెప్పింది. ఇక  రేణు దేశాయ్ ఎందుకు సన్యాసుల్లో కలిసిపోవాలి అనుకుంటుంది అనేది మాత్రం బయట పెట్టకపోయినప్పటికీ ఈ విషయం మాత్రం సంచలనంగా మారింది. అసలు రేణు దేశాయ్ సన్యాసం తీసుకుంటానని ఎందుకు అన్నది.. రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా సడన్గా సన్యాసం తీసుకుంటానని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏంటి అని చాలామంది షాక్ అవుతున్నారు. మరి చూడాలి రేణు దేశాయ్ తీసుకునే నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటో ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: