ఎలాంటి కథలు పనిచేస్తాయి, ఏ స్క్రిప్ట్‌లో కొత్తదనం ఉంది, ప్రేక్షకులకు ఏమి కావాలి అనే విషయాలను అద్భుతంగా అర్థం చేసుకునే విజన్ చిరంజీవికి ఉంది. అందుకే ఆయన ఎంచుకునే ప్రతి సినిమా ఒక పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌ను సృష్టిస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమా గురించి ఫిల్మ్ నగర్‌లో హడావిడి నడుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి ఓ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం. సినిమా టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది — “మన శంకర వరప్రసాద్ గారు..పండక్కి వచ్చేస్తున్నారు”. ఈ టైటిల్ విన్న వెంటనే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ టచ్, ఉత్సాహం, పండగ వాతావరణం మన కళ్ళ ముందు కదిలిపోతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండడం మరో హైలైట్. చిరంజీవి – నయనతార కాంబినేషన్ ప్రేక్షకుల మనసులో ఒక క్లాస్ ఫీల్‌ను కలిగిస్తుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫైనల్ స్టేజీలో ఉంది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. అనిల్ రావిపూడి సినిమాల్లో ఎప్పుడూ ఒక వినోదం, ఎంటర్‌టైన్‌మెంట్ టచ్ ఉంటుంది. అదే టైమ్‌లో ఎమోషన్ కూడా మిక్స్ అవుతుంది. అలాంటి డైరెక్టర్ చేతిలో చిరంజీవి లాంటి నటుడు నటిస్తే, ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టం కాదు — పక్కా బ్లాక్‌బస్టర్ అనే మాటే! అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం మరోస్టార్ బ్యూటీని రంగంలోకి దించారట అనిల్. ఆమె మరెవరో కాదు "Ramya Krishna". చిరంజీవి-రమ్య కృష్ణ గురించి అందరికి తెలిసిందే. వీళ్ల కాంబో మళ్లీ రిపీట్ అయితే కేవ్వు కేక అంతే..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి