- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ చుట్టూ భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్ కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ నెల చివరి వారం నుంచి షూట్ తిరిగి ప్రారంభమవుతుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆఫ్రికాలో లొకేషన్ హంట్‌లో ఉన్నారని తెలిసింది. అక్కడ కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల్లో సాగే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం. ఎన్టీఆర్ పాత్రను రగ్డ్, పవర్‌ఫుల్‌గా చూపించేలా ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడట.


ట్విస్ట్ ఏంటంటే ప్ర‌స్తుతం అదే ఆఫ్రికా అడ‌వుల్లో రాజ‌మౌళి - మ‌హేష్ బ‌బు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్ కూడా జ‌రుగుతోంది. కాక‌తాళీయంగా ఇద్ద‌రు స్టార్ హీరోల క్రేజీ సినిమాలు ఒకే చోట‌... ఒకే టైంలో షూటింగ్‌లో ఉండ‌బోతున్నాయి. ఇక ఎన్టీఆర్ - నీల్ ప్రాజెక్ట్ నవంబర్ రెండో వారం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులు పాల్గొంటారు. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఆమె పాత్రలో భావోద్వేగం, డెప్త్‌ రెండూ ఉంటాయని యూనిట్ చెబుతోంది. మ్యూజిక్ విభాగంలో రవీనా సింగ్ క్రియేటివ్ సౌండ్ ట్రాక్ అందించనున్నారు.


సినిమా మొదట 2026 జూన్‌లో విడుదల చేయాలనే ప్రణాళిక ఉన్నా షూటింగ్ షెడ్యూల్‌లలో మార్పుల కారణంగా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని టాక్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఎన్టీఆర్ కెరీర్‌లో మరో ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా నిలవనుందని అభిమానులు నమ్ముతున్నారు. యాక్షన్, ఎమోషన్, స్టైల్ — ఈ మూడు అంశాలు సమపాళ్లలో ఉండబోతున్నాయని యూనిట్ చెబుతోంది. ప్రశాంత్ నీల్ విజన్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కలయికతో ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ హిట్‌గా నిలుస్తుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: