పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళకు నేను సినిమాలకు దూరంగా ఉంటాను. కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడతాను అని చెప్పాడు. కానీ ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. పవన్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ మూవీల షూటింగ్లు కొంత భాగం అయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు రావడంతో పవన్ ఈ మూడు సినిమాలను పక్కన పెట్టి ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

ఇక ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు పవన్ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. దానితో పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నాడు. దానితో చాలా మంది కూడా పవన్ రాజకీయాల్లో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. దానితో ఆయన ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి మళ్లీ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు అనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు , ఓజి సినిమాలు విడుదల అయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మరి కొంత కాలంలో విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఇలాంటి సమయంలో పవన్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా పవన్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: