మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి కళ్యాణి ప్రియదర్శిన్ ప్రధాన పాత్రలో లోక చాప్టర్ 1 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మలయాళ భాషలో రూపొందిన ఈ సినిమాను ఆ తర్వాత చాలా భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. అందులో భాగంగా ఈ సినిమాను తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. ఇక విడుదలకు ముందు ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా కేవలం 3.25 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. దానితో ఈ మూవీ 3.50 కోట్ల టార్గెట్తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 7.95 కోట్ల షేర్ ... 15.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.45 కోట్ల లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈ సంవత్సరం తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సాధించిన డబ్బింగ్ సినిమాల లిస్టు లో చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kp