మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించిన సినిమాలలో ఖైదీ మూవీ ఒకటి. ఖైదీ సినిమా కంటే ముందు చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో ఒక మామూలు క్రేజ్ కలిగిన హీరోగా మాత్రమే కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇక ఖైదీ మూవీ వచ్చిన తర్వాత ఇది సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో ఒక్కసా రిగా చిరంజీవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ తో ఆయన స్టార్ హీరో రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మాధవి ఈ సినిమాలో చిరంజీవి కి జోడి గా నటించగా ... కోదండ రామి రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 1983 వ సంవత్సరం అక్టోబర్ 28 వ తేదీన విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 42 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 42 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మూవీ స్టార్ట్ కాక ముందు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం.

కోదండ రామి రెడ్డి ఈ సినిమాను మొదట చిరంజీవి తో కాకుండా సూపర్ స్టార్ కృష్ణ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా కృష్ణ గారిని కలిసి సినిమా కథ మొత్తాన్ని వివరించారట. కథ మొత్తం విన్న కృష్ణ స్టోరీ సూపర్ గా ఉంది ... కానీ నేను ప్రస్తుతం వేరే సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఈ సినిమా చేయలేను. వేరే హీరోతో మీరు ఈ సినిమా చేయండి అని చెప్పాడట. దానితో కోదండ రామి రెడ్డి , చిరంజీవి ని కలిసి ఈ కథను వివరించాడట. చిరంజీవి కి ఆ కథ అద్భుతంగా నచ్చడంతో చిరంజీవి వెంటనే కోదండ రామి రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఆ తర్వాత ఖైదీ అనే టైటిల్ తో ఈ మూవీ ని రూపొందించగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. అలా కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలో చిరంజీవి నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: