ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగున్నట్లయితే చిన్న సినిమాలను కూడా పెద్ద స్థాయిలో ఆదరిస్తూ వస్తున్నారు. దానితో రీసెంట్ టైం లో కొన్ని చిన్న సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయినా కూడా మంచి టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన స్థాయిలో లాభాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విడుదల అయిన ఓ చిన్న సినిమా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన లాభాలను అందుకుంది.

ఇంతకు ఆ మూవీ ఏది అనుకుంటున్నారా ..? ఆ సినిమా మారేదో కాదు లిటిల్ హాట్స్. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 7.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.45 కోట్లు , ఆంధ్ర లో 6.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 15.40 కోట్ల షేర్ ... 28.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 5.66 కోట్ల కలెక్షన్లు దక్కాయి. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 21.06 కోట్ల షేర్ ... 39.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ కి ఏకంగా 18.06 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: