ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉన్న శోభా శెట్టి ప్రముఖ నటుడు యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ సమయంలోనే వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మాత్రం తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలోనే తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా బయటపెట్టింది శోభ. ఆ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
గత ఏడాది ఏప్రిల్ వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోగా వివాహం గురించి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శోభా శెట్టి తన పెళ్లి విషయంపై ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ అందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు మాత్రం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా పెళ్లి దుస్తులలో శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి నూతన వధూవరుల్లా కనిపించారు. అలాగే ఇద్దరు కూడా తలంబ్రాలు పోసుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు, నెటిజన్స్ సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇది నిజమైన పెళ్లా? లేకపోతే ఏంటా అన్న విషయం తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి