తమిళ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన సినిమాలను ఈ మధ్య కాలంలో తమిళ్ తో పాటు తెలుగులో కూడా పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. కొంత కాలం క్రితం ఈయన నటించిన దర్శకత్వం వహించిన లవ్ టుడే సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయగా ఈ సినిమా తెలుగు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఈయనకు నటుడిగా , దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈయన నటించిన డ్రాగన్ సినిమా కూడా తెలుగులో మంచి విజయం సాధించింది. తాజాగా ఈయన డ్యూడ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని కూడా తెలుగు లో విడుదల చేశారు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా చాలా ఈజీగా హిట్టు స్టేటస్ను తెలుగు రాష్ట్రాలలో అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.80 కోట్ల షేర్ ... 17.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 11 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 1.20 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లయితే హిట్టు స్టేటస్ను అందుకుంటుంది.

మూవీ హిట్ స్టేటస్ కు అత్యంత దగ్గరగా వచ్చిన కూడా మరికొన్ని రోజుల్లోనే రవితేజ హీరోగా రూపొందిన మాస్ జాతర సినిమా విడుదల కానుంది. ఆ సినిమా విడుదల అయితే ఈ సినిమా యొక్క థియేటర్లు తగ్గి అవకాశం ఉంటుంది. ఒక వేళ ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినట్లయితే మూవీ హిట్ స్టేటస్ను అందుకునే అవకాశాలు అత్యంత తక్కువగా ఉంటాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అదే జరిగితే ఇప్పటికే వరుసగా రెండు విజయాలను అందుకున్న ఈయన హిట్లకు బ్రేక్ పడుతుంది అని కూడా చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: