టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈయన ఆఖరుగా నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఇస్మార్ట్ మూవీలు వరుస పెట్టి భారీ ప్లాప్ లను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఇలా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సమయంలో ఈయన మహేష్ బాబు పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్డ్స్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా రామ్ తన తదుపరి మూవీ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ... రామ్ తన తదుపరి మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నట్లు , ఇప్పటికే అనిల్ , రామ్ కి ఓ కథను వినిపించగా ఆ కథ బాగా నచ్చడంతో రామ్ వెంటనే అనిల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మొదట అనిల్ , రామ్ ని హీరోగా అనుకున్నట్లు , అందులో భాగంగా ఆయనను కలిసి కథను కూడా వివరించగా , కొన్ని కారణాలతో ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రాజా ది గ్రేట్ మూవీ తర్వాత చాలా సంవత్సరాలకు రామ్ , అనిల్ కాంబోలో మూవీ సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: