తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న కమీడియన్లలో సంతానం ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం అనేక తమిళ సినిమాలలో నటించి అద్భుతమైన కామెడీని పండించి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. ఈయన నటించిన ప్రతి సినిమాలో కూడా తనదైన మార్క్ కామెడీని ప్రదర్శిస్తూ ఎన్నో సినిమాల విజయాలలో కూడా ఈయన అత్యంత కీలక పాత్రను పోషించాడు. దానితో కమీడియన్గా ఈయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. ఆ సినిమాలలో కూడా ఈయన కామెడీ అద్భుతంగా ఉండడంతో ఈయనకు కమీడియన్గా తెలుగు సినీ పరిశ్రమలో కూడా సూపర్ సాలిడ్ గుర్తింపు ఏర్పడింది. అలా కమెడియన్గా అద్భుతమైన స్థాయికి చేరుకున్న ఆయన గత కొంత కాలంగా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. కానీ ఏ హీరో సినిమాల్లో కమీడియన్గా నటించడం లేదు. ఇకపోతే ఈయన మళ్లీ సినిమాల్లో కమెడియన్ పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ సూపర్ హిట్ మూవీ అయినటువంటి జైలర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో జైలర్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో సంతానం కమీడియన్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో సంతానం నిజం గానే నటించినట్లయితే ఈ మూవీ కామెడీ సన్నివేశాలపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: