మెగాస్టార్ చిరంజీవి—మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో హైప్ ఏకంగా ఆకాశాన్నంటుతోంది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్‌హిట్ తర్వాత, ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలే అభిమానుల్లో సంబరాన్ని రేపుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ సెలెక్షన్ విషయంలో బాబీ చేసిన సర్ప్రైజ్ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇంతవరకు ఈ సినిమాలో మాళవిక మోహనన్, రాశీ ఖన్నా పేర్లు వినిపించాయి. ఇద్దరూ టాలెంటెడ్ హీరోయిన్‌లు కావడంతో, అభిమానులు కూడా ఈ కాంబినేషన్ బాగుంటుందని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ లిస్ట్ మొత్తం మారిపోయిందట. చివరి నిమిషంలో బాబీ పెద్ద ట్విస్ట్ ఇచ్చారట. ఇప్పుడు ఈ సినిమాలో మాళవిక, రాశీల స్థానంలో ఇద్దరు సీనియర్ అండ్ సక్సెస్‌ఫుల్ బ్యూటీస్ రాబోతున్నారట — వాళ్లే శ్రుతి హాసన్ మరియు జ్యోతిక.


ఇద్దరూ చిరంజీవికి హిట్ ఇచ్చిన అదృష్ట దేవతలే అనే సంగతి ప్రత్యేకం. శ్రుతి హాసన్‌తో చిరంజీవి ‘వాల్తేయర్ వీరయ్య’లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, చిరు కెరీర్‌లో మళ్లీ బ్లాక్‌బస్టర్ లైఫ్ ఇచ్చింది. ఇక జ్యోతిక అయితే చిరంజీవితో కలిసి నటించిన ‘ఠాకూర్’ చిత్రంలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.ఇప్పుడు అదే ఇద్దరు హీరోయిన్స్ మళ్లీ చిరంజీవితో కనిపించబోతున్నారంటే, ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు. బాబీ కూడా ఇదే కారణంతో వారిని సెట్ చేశారని ఇండస్ట్రీ టాక్. ఒకవైపు గ్లామర్, మరోవైపు ఎమోషన్, స్ట్రాంగ్ క్యారెక్టర్‌లు కావాలని బాబీ కోరుకోవడంతో ఈ రెండు పేర్లు ఫైనల్ అయ్యాయట. శ్రుతి హాసన్ యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే మోడరన్ గ్లామరస్ రోల్‌లో కనిపిస్తే, జ్యోతిక కుటుంబ భావోద్వేగాలతో నిండిన పాత్రలో మెప్పించనుందట.



ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ టచ్ కూడా బాబీ అందించాలనుకుంటున్నారట. ఇప్పటికే స్టోరీ, డైలాగ్స్‌ ఫైనల్ అయ్యాయి. మ్యూజిక్ కోసం దేవీశ్రీ ప్రసాద్ లేదా థమన్‌లో ఎవరు ఫైనల్ అవుతారన్నది ఆసక్తికర చర్చగా మారింది.మొత్తం మీద, రాశీ ఖన్నామాళవిక మోహనన్‌లను డ్రాప్ చేసి, బదులుగా శ్రుతి హాసన్ – జ్యోతికలను తీసుకోవడం బాబీ చేసిన స్మార్ట్ మూవీ. ఎందుకంటే ఈ ఇద్దరూ చిరంజీవికి గుడ్ లక్ సింబల్స్‌గా నిలిచినవారు. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో “మెగా అదృష్ట దేవతలు మళ్లీ కలిసారు” అంటూ ట్రెండ్స్ మొదలుపెట్టేశారు. చూస్తుంటే.. ఈసారి బాబీ–చిరు కాంబినేషన్ మరోసారి మెగాహిట్ ఇవ్వడం ఖాయం అనిపిస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: