టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ తాజా సినిమా మాస్ జాతర బాక్సాఫీస్ దగ్గర తొలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రవితేజ గత కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమత మవుతున్నాడు. ఎన్ని ప్లాపులు వచ్చినా కూడా రవితేజ కొత్త దర్శకులతో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడే తప్పా హిట్లు మాత్రం రావడం లేదు. అసలు రవితేజ హిట్టు అనే మాట ఎప్పుడో మర్చిపోయాడు. రవితేజ హిట్ కోసం .. ప్రేక్షకులను శాటిస్ పై చేసేందుకు సినిమాలు చేస్తున్నాడా ? లేక తన రెమ్యునరేషన్ కోసం .. తన ఖాతాలో ఒక సినిమా చేయాలన్న కౌంట్ కోసం సినిమా చేస్తున్నాడో అర్థం కావడం లేదు.
ఇక మాస్ జాతర విషయానికి వస్తే రవితేజ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న కొత్త దర్శకుడు భాను భోగవరపు, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ అయితే ఆసక్తి గా రాసుకోలేదు. ఇక సెకండాఫ్ లో అయితే మరీ బోర్ కొట్టేసింది. చాలా సీన్లు స్లో గా రెగ్యులర్ గా పోతూ ఉంటాయే తప్పా ప్రేక్షకులు వాటికి అస్సలు కనెక్ట్ కారు. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. చివరకు
ఒక్క క్లైమాక్స్ లో తప్ప కొన్ని చోట్ల కథనంలో ఆసక్తి .. ఆ ఎగ్జైట్మెంట్‌నే ఎక్కడా కనిపించదు. కథనాన్ని ఇంకా ఆసక్తి గా మలిచే అవకాశం ఉన్నా దర్శకుడు తనదైన స్టైల్లోనే సినిమాను ముగించేశాడు.
కొన్ని డైలాగులు .. హీరో రవితేజ క్యారెక్టరైజేషన్, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం యావరేజ్ కన్నా తక్కువ స్తాయికే పరిమితం అయినట్టు గా కనిపిస్తుంది. రవితేజ గత కొన్నాళ్లుగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ప్లాపులు కొడుతున్నారు. అదే రవితేజ కాస్త పేరున్న దర్శకులతో సినిమాలు చేసి హిట్లు కొడితే తప్పా రవితేజకు హిట్లు పడేలా లేవు. ఏదేమైనా రవితేజ వరుస సినిమాలతో తన రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలను మాత్రం బలి చేస్తున్నాడన్న టాకే ఇండస్ట్రీలో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి