ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో భయం అనేది ఉంటుంది. దాన్నే ఫోబియా అని అంటారు. అయితే ఈ ఫోబియాలో చాలా రకాలు ఉంటాయి. కొంతమంది పాములకు భయపడితే మరి కొంతమంది కుక్కలకు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి భయపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాల ఫోబియాలు ఉంటాయి. అయితే ఇప్పుడు చనిపోయిన ఒక వివాహితకి మాత్రం చీమలకు భయపడే ఫోబియా ఉందట.అయితే చీమలే కదా అని సిల్లీగా తీసుకోవద్దు. చీమలు తలుచుకుంటే పాముని కూడా చంపగలవు అలా చీమల వల్ల ఓ నిండు ప్రాణం బలైంది.. చీమలకు భయపడి ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక విషయం ఏమిటంటే.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లోని మనీషా అనే వివాహిత తన ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి ఉరివేసుకొని మరణించింది. మనిషా 2022లో మంచిర్యాలకి చెందిన శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుంది. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది.. 

ఇక పెళ్లయ్యాక రెండేళ్లకు శ్రీకాంత్ కి హైదరాబాద్ లో జాబ్ రావడంతో వృత్తిరీత్యా వీరిద్దరూ కలిసి హైదరాబాద్ కి మకాం మార్చారు. అలా ప్రతిరోజు డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేవారు శ్రీకాంత్. కానీ మంగళవారం రోజు ఇంటికి వచ్చి తన భార్యను చూడకూడని పరిస్థితిలో చూశాడు. నవంబర్ 4 మంగళవారం రోజు సాయంత్రం ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన శ్రీకాంత్ కి లోపల నుండి డోర్ పెట్టినట్టు అర్థం అవ్వడంతో పక్కనే ఉన్న వారి సహాయంతో డోర్ బద్దలు కొట్టాడు. ఆ తర్వాత తన భార్య ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించింది. అంతేకాదు ఆ పక్కనే ఓ సూసైడ్ లెటర్ కూడా ఉంది. అది చూసిన శ్రీకాంత్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇక మనిషా రాసిన ఆ లెటర్ లో ఏముంది అంటే ఈ చీమలు నన్ను ఇక బతకనివ్వవు.. నన్ను క్షమించు శ్రీ.. ఇక బతకడం నావల్ల కాదు.అన్వీ పాపని జాగ్రత్త గా చూసుకో.. ఎల్లమ్మ ఒడిబియ్యం,

తిరుపతి,అన్నవరం హుండీలో వేయవలసిన 1116 మర్చిపోకు అంటూ ఆ లెటర్లో రాసింది.. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిషాకి చిన్నప్పటినుండే మైర్మేకోఫోబియా ( చీమలు అంటే భయం )ఉందట. అలా చీమలు చూసి తెగ భయపడిపోయేదట.  అలా చివరికి చీమల మీద ఉన్న భయం సూసైడ్ చేసుకునేదాకా తీసుకొచ్చింది. అలా చీమల కారణంగా ఆమెకున్న ఫోబియా కారణంగా ఒక నిండు ప్రాణం తీసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారడంతో చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక మూడేళ్ల పాపను వదిలేసి చీమల వల్ల ఉండే భయం కారణంగా ఆ వివాహిత మరణం గ్రామంలో విషాదం నింపింది. ఇక అమీన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం చేశాక మంచిర్యాలలోని స్వగ్రామానికి  డెడ్ బాడీని తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: