కార్తీకదీపం 2 సీరియల్లో నటించేందుకు ప్రేమి విశ్వనాథ్ రోజుకి రూ.50 వేల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటోందని సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో ఈమె ఆదాయం ప్రతినెల రూ .10 లక్షల రూపాయల వరకు ఉంటున్నట్లు వినిపిస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం వెనకడుగు వేయకుండా హీరోయిన్స్ రేంజ్ లో తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రేమి విశ్వనాథ్ ఆస్తి కూడా రూ. 30 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఆమె వద్ద రెండు లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలతో పాటు సినిమా షూటింగ్లకు సంబంధించిన స్టూడియోలు కూడా ఉన్నాయి.
నటన కంటే ముందుగా మోడలింగ్ రంగంలో గుర్తింపు అందుకున్న ప్రేమి విశ్వనాథ్ ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది.2014లో కరతముత్తు అనే సీరియల్ ద్వారా మొదటిసారి మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2017లో కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత 2019లో గోరింటాకు సీరియల్ లో కూడా నటించింది. కార్తీకదీపం సీరియల్ కు స్టార్ మా పరివార్ అవార్డును కూడా 2018లో అందుకుంది ప్రేమి విశ్వనాథ్. ప్రేమి విశ్వనాథ్ భర్త(వినీత్ భట్) జ్యోతిష్యుడుగా ఉన్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇటీవలే తన కుమారుడుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి