బయటికి వచ్చిన తర్వాత పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొన్న మాదిరి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ముఖ్యంగా తాను కావాలని హౌస్ లో నుంచి బయటికి వచ్చానని నేను వెళ్ళాలి అనుకున్నాను కాబట్టే హౌస్ లోకి వెళ్ళాను అలాగే బయటికి రావాలనుకున్నాను కాబట్టి వచ్చేసానంటూ సమాధానాన్ని చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. తాను హౌస్ లోకి డబ్బుల కోసం వెళ్లలేదు నాకు ఇక్కడే రోజుకి రూ .2నుంచి 3 లక్షల రూపాయలు వస్తాయి.
కాబట్టి నేను డబ్బు కోసం పెద్దగా టెంప్ట్ అవ్వాల్సిన పనిలేదు. షో అంత ఆడితే కోటి రూపాయలు వస్తాయి కానీ నేను నెల రోజులలోకి కోటి రూపాయలు ఇక్కడ సంపాదిస్తానని, తాను హౌస్ లోకి వెళ్లడానికి ఎలాంటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదని, దేవుడు ఇచ్చినవరకు మాకు డబ్బులు బాగానే ఉన్నాయి, ఫేమ్ కూడా బాగానే వచ్చింది. లైఫ్ లో అన్నీ చేయాలి ఇది కూడా మన లైఫ్ లో ఒక అవకాశం వంటిది కాబట్టే వెళ్లానని తెలిపింది. ప్రస్తుత మాధురి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి కొంతమంది మాధురి నెలకు కోటి రూపాయలు సంపాదిస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి