ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోలను ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ను బట్టి చూస్తే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ సినిమా అని అర్థం అవుతుంది.

మూవీ లో దీపికా పదుకొనే , జాన్వీ కపూర్ ,  మృనాల్ ఠాకూర్  హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. కొన్ని రోజుల క్రితం పూర్తి అయిన ఈ మూవీ షెడ్యూల్లో మృనాల్ ఠాకూర్  పాల్గొన్నట్లు తెలుస్తోంది. మృనాల్ ఠాకూర్ పై కొన్ని కీలక సన్నివేశాలను కూడా మూవీ బృందం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్లో జాన్వి కపూర్  జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మూవీ బృందం నెక్స్ట్ షెడ్యూల్లో అల్లు అర్జున్ మరియు  జాన్వి కపూర్ పై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే పుష్ప లాంటి భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ కావడం , ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అట్లీమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో బన్నీ , అట్లీ కాంబో లో రూపొందుతున్న సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa