అదే సమయంలో “దేవర 2” కూడా మొదలుకానుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ జీవితంలో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు రీ-డిస్కస్ అవుతోంది. ఆయనకు సినిమాలో భార్యగా కూడా, తల్లిగా కూడా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? అవును.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన హీరోయిన్ సంఘవి! ఒకప్పుడు తెలుగు తెరపై అగ్ర నటి స్థాయిని దక్కించుకున్న సంఘవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించింది. మృదువైన అందం, సాఫ్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది.
2004లో విడుదలైన “ఆంధ్రావాలా” చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించారు. తండ్రి-కొడుకులుగా రెండు విభిన్న పాత్రలను అద్భుతంగా పోషించారు తారక్. అందులో తండ్రి పాత్రకు భార్యగా సంఘవి నటించింది. సినిమాలో శంకర్ పెహల్వాన్ పాత్రలో తారక్‌కి ఆమె భార్యగా కనిపించి, కొడుకుకి జన్మనిచ్చి చనిపోతుంది. ఆ తరువాత అదే సినిమాలో కొడుకుగా మళ్లీ తారక్ ఎంట్రీ ఇస్తాడు. అలా ఒకే సినిమాలో భార్యగా కూడా, తల్లిగా కూడా ఎన్టీఆర్‌కి నటించిన రేర్ రోల్ ఆమెదే!
అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయినా, ఈ విషయం మాత్రం చాలా మందికి గుర్తుండిపోయింది. ఇప్పుడు “డ్రాగన్” షూటింగ్ జోరుగా సాగుతుండగా, అభిమానులు పాత జ్ఞాపకాలను రీకాల్ చేస్తున్నారు. "ఒకే సినిమాలో హీరోకి భార్య, తల్లి – రెండు పాత్రలు చేసిన హీరోయిన్ ఎవరు?" అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నా, సీనియర్ యాక్ట్రెస్‌గా సంఘవి పేరు మాత్రం అభిమానుల గుండెల్లో ముద్రవేసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి