ఇక అభిమానులు ఎదురుచూస్తున్న భారీ ఈవెంట్ నవంబర్ 15న జరగబోతోంది. ఈ ఈవెంట్‌ను కేవలం ఇండియా వరకే పరిమితం చేయకుండా, గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేయడం రాజమౌళి మార్క్‌కు మరో ఉదాహరణగా నిలుస్తోంది.ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ ఈ ఈవెంట్‌కి అద్భుతమైన గ్లోబల్ టచ్ ఇచ్చింది. లైవ్ స్ట్రీమింగ్‌ను నేరుగా దుబాయ్‌లోని అల్ గురైర్ సెంటర్ – స్టార్ సినిమాస్ లో ప్రదర్శించనున్నారు. అదీ సాధారణ లైవ్ కాదు, అత్యాధునిక డాల్బీ సినిమాస్ వెర్షన్ లో ప్రసారం కానుందట. అంటే, ఈ లైవ్ ఈవెంట్‌ను కూడా ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చేలా జక్కన్న బృందం ప్లాన్ చేసిందన్న మాట.
ఒక లాంచ్ ఈవెంట్‌కే ఈ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికలు వేస్తున్నారని చూస్తే, అసలైన సినిమా ప్రమోషన్ దశలో ఎలాంటి గ్లోబల్ హంగామా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే “భారత సినిమా గర్వకారణం”గా పేరు తెచ్చుకుంటుండగా, ఇప్పుడు “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్‌తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. “గ్లోబల్ లెవెల్” అనే పదానికి అసలైన అర్థం చూపించేది జక్కన్నే. ఆయన ప్లానింగ్, ప్రెజెంటేషన్, మరియు విజన్ చూస్తుంటే ఇది కేవలం సినిమా కాదు — ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సినీ మైలురాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి