తెలుగు సినీ ప్రేక్షకులను ఒకప్పుడు తన అందంతో, తన అభినయంతో అలరించిన బాలీవుడ్ బ్యూటీ మహిమా చౌదరి… ఈ పేరుని మరచిపోయిన వారు చాలా తక్కువ. 90ల చివరి దశలో, 2000ల ప్రారంభంలో హిందీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అందగత్తె, తెలుగులో కూడా మంచి గుర్తింపు సాధించింది. హీరో శ్రీకాంత్ సరసన వచ్చిన ‘మనసులో మాట’ సినిమాలో ఆమె చేసిన పాత్ర అప్పట్లో యువతను ఒక్కసారిగా ఆకట్టుకుంది. ఆ సినిమా మంచి హిట్ కావడంతో మహిమా తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందనుకున్నారు కానీ, ఆమె అలాగే మాయం అయిపోయింది. మరో ప్రాజెక్ట్‌కూ అవకాశం ఇవ్వకుండానే తిరిగి బాలీవుడ్‌కే పరిమితమైంది. హిందీలో ‘పర్దేస్’ లాంటి కల్ట్ క్లాసిక్ నుండి ‘దహీజ్’, ‘కురుక్షేత్ర’, ‘బాగ్‌బాన్’ వరకు వరుసగా హిట్స్ ఇచ్చిన మహిమా… చాలా కాలం తర్వాత కెమెరాల నుండి దూరమై ప్రశాంత జీవితం గడిపింది.
 

దాదాపు 10 సంవత్సరాలకు పైగా విరామం తీసుకున్న ఆమె, 2024లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌తో రీఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తిరిగి తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా కంగనా రనౌత్ నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాలో ఆమె చేసిన పాత్ర మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే సంజయ్ మిశ్రా, దుర్లభ్ ప్రసాద్‌లతో కలిసి మరో కీలక సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా… ప్రస్తుతం ఆమెకన్నా ఎక్కువ హైలైట్ అవుతున్న వ్యక్తి ఆమె కూతురు ఆర్యనా చౌదరి. కేవలం 18 ఏళ్ల వయసులోనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ స్టార్ కిడ్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవ‌లే ఆమె గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.

 

ఇక ఆ ఫోటోలలో ఆర్యనా తన తల్లి మహిమాను పూర్తిగా రీప్లికా లా కనిపించగా, “ఇండస్ట్రీలోకి వచ్చే నెక్స్ట్ స్టార్ హీరోయిన్ ఇదే” అంటూ నెటిజెన్లు ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నారు. తల్లితో కలిసి ఫ్యాషన్ ఈవెంట్స్, సినీ పార్టీల్లో తరచూ కనిపిస్తున్న ఆర్యనా… తానే కానీ స్టార్ మేటీరియల్ అని ప్రూవ్ చేస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే పలు నిర్మాతలు ఆమెను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఆర్యనా కూడా తల్లి అడుగుజాడల్లో నడిచి వెండితెర మీద నటిగా ఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు యూత్‌ హార్ట్‌థ్రాబ్‌గా నిలిచిన మహిమా… ఇప్పుడు తాను కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తూనే, తన కూతురిని కూడా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి రెడీ అవుతుండటం, అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. మహిమా & ఆర్యనా—ఈ మదర్-డాటర్ డ్యుయో ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్!


https://www.instagram.com/reel/DKa7P1DTI4t/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

మరింత సమాచారం తెలుసుకోండి: