పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చేలా మైథలాజికల్ అంశాలు ఉండేలా ట్రైలర్ ను సిద్ధం చేశారు. సనాతన ధర్మం కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఆది పినిశెట్టి రోల్ ను పవర్ ఫుల్ గా చూపించారు. థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిన సినిమాగా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. థమన్ బీజీఎం తో అదరగొట్టారు.
ట్రైలర్ లో సంయుక్త మీనన్ కు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోయినా ఆమె రోల్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. అఖండలోని చిన్న పాప పెద్దయిన తర్వాత ఆ పాత్రకు లింక్ చేసేలా కథ ఉంది. కొన్ని షాట్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. డైలాగ్స్ ట్రైలర్ కు ప్లస్ అయ్యాయి. బాలయ్య మూడు లుక్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. దాదాపుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ కు న్యాయం చేశారనే చెప్పాలి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సొంతం చేసుకుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేరే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి