ఈ సందర్భంలో అక్కడికి వచ్చిన బ్రహ్మానందంను చూసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, “అన్నా, ఒక్క ఫోటో…” అంటూ ఆయన చేతిని పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. అయితే బ్రహ్మానందం ఆపినప్పటికీ ఆగకుండా, “అబ్బే… ఇప్పుడే కాదు,” అన్నట్లుగా ఆయన చేయిని పక్కకు నెట్టి ముందుకు వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక ఎర్రబెల్లి కూడా అక్కడినుంచి వెనుదిరిగారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
“పవర్‌లో లేకపోతే ఈ సినిమా వాళ్లు ఎవరిని పట్టించుకోరు,” అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, “అనవసరంగా వివాదం చేయవద్దు. ఇది పూర్తిగా ఫ్రెండ్లీ మూమెంట్‌లాగా కనిపిస్తోంది,” అంటూ మరికొందరు చెప్పుకుంటున్నారు. మొత్తం గా బ్రహ్మానందం – ఎర్రబెల్లి వీడియో వ్యవహారం సోషల్ మీడియాలో ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. ఇది నిజంగానే సీరియస్ ఇష్యూనా? లేక సరదాగా జరిగిన చిన్న అపార్థమా? అనేది ఇప్పుడు హాట్ గా ట్రెండ్ అవుతుంది..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి