ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ చివరికి పట్టాలెక్కింది. చాలాకాలంగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ భారీ సినిమా ఆదివారం జరిగిన ఘనమైన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భద్రకాళి పిక్చర్స్ మరియు టీ-సిరీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, హై స్టాండర్డ్స్‌తో రూపొందబోతోంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు నుంచే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో, ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఘనమైన నేపథ్యం, సందీప్ రెడ్డి వంగా మాస్ & ఇంటెన్స్ డైరెక్షన్ స్టైల్, ప్రభాస్ పాన్ వరల్డ్ ఇమేజ్ అన్ని ‘స్పిరిట్’ ని హాట్ టాపిక్‌గా మారుస్తున్నాయి.


ఇక హీరోయిన్‌గా ‘ఆనిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రి ఎంపిక కావడం సినిమాకు మరింతగా క్రేజ్ తెచ్చింది. పూజా కార్యక్రమాలకు భూషన్ కుమార్, హీరోయిన్ త్రిప్తి డిమ్రి తదితరులు హాజరై చిత్ర ప్రారంభ వేడుకను మరింత రంగులద్దారు.అయితే, ఈ అందమైన వేడుకలో ఒక్క విషయం మాత్రం అభిమానులకి డిసప్పాయింట్‌గా మారింది.  పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలో ప్రభాస్ లేని విషయం అందరినీ నిరాశపరిచింది. పూజా సెరిమనీలో ఆయన లుక్స్ లీక్ అవుతాయని  ఆశించిన డార్లింగ్ ఫ్యాన్స్, ఫోటోలు చూసి కొంత మ‌న‌స్ఫూర్తిగా మ‌న‌స్తాపం వ్యక్తం చేస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం త్వరలోనే ప్రభాస్ పాల్గొనే షూట్ అప్డేట్స్ మరియు కొత్త ఫోటోలు విడుదల చేయనున్నట్టు సమాచారం.



మొత్తం మీద, ‘స్పిరిట్’ ప్రారంభం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సందీప్ వంగా–ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఇండస్ట్రీ అంతా, ప్రేక్షకులంతా ఆసక్తిగా గమనిస్తున్న విషయం . షూటింగ్ మొదలైనందున ఇకపై రెగ్యులర్‌గా అప్‌డేట్లు వస్తాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: