సినిమా ఇండస్ట్రీ ని గడగడలాడిస్తున్నటువంటి   పైరసీ సైట్ల లో ఐ బొమ్మ కీలకంగా ఉండేది. ఈ సైట్ లో థియేటర్లోకి వచ్చిన ప్రతి సినిమా గంటల వ్యవధి లోనే అందులోకి వచ్చేది. దీంతో ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాతలు తలలు పట్టుకొని ఇబ్బందులు పడేవారు. ఇక ఐ బొమ్మ నిర్వాహకున్ని పట్టుకునేందుకు కొన్ని సంవత్సరాలుగా పోలీసులు తిరుగుతూనే ఉన్నారు. కానీ చివరికి తన భార్య వల్ల వచ్చిన సమస్యల తో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులకు దొరికి పోయాడు. దీంతో పోలీసులు ఆయన్ని అదుపు లోకి తీసుకొని ఆ సంస్థ ను ఎలా నిర్వహించేవాడు..ఎలా డబ్బులు తీసుకునేవాడు.. అసలు ఎక్కడెక్కడ నుంచి ఆయన సపోర్ట్ చేశారనే దాని పై ఆరా తీస్తున్నారు. 

ఇదిలా నడుస్తున్న సమయం లోనే  సినిమా ఇండస్ట్రీ ని మరో పైరసీ సంస్థ కుదేలు చేస్తోంది. ఇంతకీ అది ఏంటయ్యా అంటే.. మూవీ రూల్స్.. అయితే ఈ వెబ్ సైట్  రకరకాల దారులు మార్చుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతోంది.. శుక్రవారం విడుదలైనటు వంటి సినిమాలు ఒక్క రోజు కూడా గడవక ముందే ఇందులో ప్రత్యక్షమయ్యాయి. అయితే థియేటర్లలో కెమెరా ద్వారా రికార్డు చేసిన ప్రింట్ లను అప్లోడ్ చేశారు. అయితే మూవీ రూల్స్ నిర్వాహకులను పట్టుకోవాలని పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా  అది సాధ్యపడడం లేదు.

మరి చూడాలి ఐ బొమ్మ రవిని అరెస్టు చేసినట్టు మూవీ రూల్స్ నిర్వహకులను  కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదంటే సైలెంట్ గా ఉంటారా అనేది త్వరలో తెలియబోతోంది.. అలా ఆ మధ్యకాలంలో ఐ బొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు సవాల్ విసిరి అడ్డంగా ఇరుక్కున్నాడు. మరి మూవీ రూల్స్ నిర్వాహకులు కూడా పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతూ కటకటాల్లో చిక్కుకుంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: